Asianet News TeluguAsianet News Telugu

బాబూ , నీరెయిన్ గన్ ఎక్కడ సామీ!

  • అనంతపురం జిల్లా కరువు లోకి జారుకుంటూ వుంది 
  • వర్షాలు రాక వేరు శనగ రైతులు గుండె జారిపోయింది
  • రెయిన్ గన్ తో నీళ్లిస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పత్తాలేడు

 

drought looming large on Anantapuram district

 అనంతపురం జిల్లాలో ఇపుడు ఎటూ చూసినా బీడు భూములే. విత్తనం వేసే పరిస్థితి రాలేదు. అదును దాటిపోయింది.వర్షం జాడే లేదు.

రాష్ట్రంలో భారీగా వేరుశనగ పంట పండించేది ఇక్కడే.  ఖరీఫ్ లో దాదాపు 6 లక్షల ఎకరాలలో వేరుశనగ వేస్తారు. అయితే, ఈ ఏడాది ఇప్పటి దాకా 1.3 లక్షల ఎకరాల్లోనే  విత్తనం పడింది. విత్తనం వేయని రైతులు వర్షం కోసం మోర ఎత్తుకుని ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, విత్తనం వేసేందుకు ఉన్నగడువు జూలై 31న ముగిసింది. ఇక వేరు శనగ విత్తనం వేయలేరు. ఇదొక పరిస్థితి అయితే, జూన్ నెలలో కురిసిన వర్షాలతో వేరు శనగ విత్తనం వేసిన రైతుల పరిస్థితి మరొక విధంగా ఉంది. జూన్ లో 60 వేల ఎకరాలలో వేరు శనగ వేశారు. అదంతా ఎండి పోతా ఉంది.

సోమవారం నాడు వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ఒక సమీక్షా సమావేశంలో వాతావరణ శాఖ అధికారులు ఆగస్టు రెండో వారం దాకా వర్షాలు లేవన్నారు. జిల్లాలోని 26 మండలాల్లో 4 వేల ఎకరాలలో వేరశనగపంట బెట్ట దశలో ఉంది. జూన్ లో 59.2 మి.మీ వర్షపాతం నమోదయింది. జూలైలో కురిసింది కేవలం 20 మి.మీ మాత్రమే.  ఈ పరిస్థితుల్లో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్  జిల్లాలో పర్యటించి  రెయిన్ గన్లొస్తాయి, పంటలను కాపాడతాయని చెప్పారు. గత ఏడాదేమో ముఖ్యమంత్రి భూగర్భ జలాలు పెరిగాయి, దీని తన ప్రభుత్వమే కారణమన్నారు. ఈ ఏడాది భూగర్భ జలాలు పడిపోయాయి. పండ్లతోటల రైతులు కూడా ఆందోళన చెందే పరిస్థితి వస్తున్నది. ముఖ్యమంత్రి ఏమంటారో ఇంకా తెలియడం లేదు. ముఖ్యమంత్రి ఈ జిల్లా పర్యటించినపుడల్లా మీకు నా రెయిన్ గన్ అండ్ అన్నారు. అసలు ఆయన రెయిన్ గన్ ను ప్రయోగాత్మక ప్రయోగించింది కూడా ఈ జిల్లా నుంచి. గన్ భూజనేసుకుని ముఖ్యమంత్రి ఎపుడొస్తారా అని జిల్లా రైతులంతా ఎదరుచూస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios