సిలికా నీటిని తాగినందునే ఉద్దానం సమస్య వచ్చింది(బ్రేకింగ్)

First Published 31, Jul 2017, 1:37 PM IST
drinking of silica water reason for Udhanam kidney problem
Highlights

ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారానికి జరిపిన అధ్యయనం, సిఫారసులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రజెంటేషన్

ఉద్ధానం కిడ్నీ సమస్య పరిష్కారానికి జరిపిన అధ్యయనం, సిఫారసులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రజెంటేషన్ ఇచ్చింది.

సిలికా మినరల్ కలిపిన నీటిని తీసుకోవడం కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణంగా గుర్తించామని ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోన్‌వెంట్రీ అన్నారు.

ఈ సమస్య కేవలం ఉద్దానంలోనే లేదు, దక్షిణ అమెరికా, యూరోప్‌లోని కొన్ని దేశాల్లో ఉందని హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోన్‌వెంట్రీ చెప్పారు.

తక్కువ మంచినీరు తాగే అలవాటు ఉండటం ఈ వ్యాధికి కారణమని,  జన్యుపరమైన సమస్యలు, పౌష్టికాహారలోపం కూడా కారణమయి కూడా ఉండవచ్చని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో  స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అటానమస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని జోసఫ్ ముఖ్యమంత్రికి సూచించారు.


దేశంలో తక్కువ మంది నెఫ్రాలజిస్టులు ఉండటమే పెద్ద సమస్య అని సీయం చంద్రబాబు తెలిపారు. ఉద్ధానం నెఫ్రోపతిపై ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

loader