మంచి నీరే కదా.. అని చులకనగా చూడకండి..!

Drinking Enough Water Can Help You Lose Weight
Highlights

  • మంచినీటిలో ఎలాంటి క్యాలరీస్ ఉండవు.
  • కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది

 

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా తిండి తినడం మానేస్తుంటారు... అలాంటివేమి చేయకుండానే.. సులభంగా బరువు తగ్గవచ్చు. అది కూడా కేవలం మంచి నీళ్లు తాగడం ద్వారా.  మంచి నీళ్లు తాగితే బరువు ఎలా తగ్గుతారు.. అనుకుంటున్నారా.. మరీ అంత చులకనగా చూడకండి.మీరు  చదివింది నిజమే.. మంచి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.మంచినీటిలో ఎలాంటి క్యాలరీస్ ఉండవు. బరువు తగ్గడం మాత్రమే కాదు.. కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుందని పరిశోధనలో తేలింది.

మంచినీరు ఎక్కువ తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకలిని నిరోధిస్తుంది..

శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు  నీరు ఉపయోగపడుతుంది. శరీరంలో నీటి నిల్వలు తగ్గిపోతే.. కొవ్వు శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా..  మంచి నీళ్లు ఎక్కవగా తీసుకోవడం ద్వారా..కిడ్నీ  సంబంధిత వ్యాధు రాకుండా.. అవి చక్కగా పనిచేస్తాయి. నీరు.. ఆకలిని కూడా నిరోధిస్తుంది. దీంతో.. బరువు తగ్గడం సులువౌవుతుంది.

 శరీర బరువును పట్టి నీరు తీసుకోవాలి..

మంచి నీరు శరీర బరువును పట్టి తీసుకోవాలి. ఎక్కవు బరువు( ఉబకాయం) ఉన్న వాళ్లు.. తక్కువ బరువు ఉన్న వారితో పోలిస్తే..ఎక్కువ  నీరు తాగడం చాలా అవసరం.  బరువు ఎక్కువగా ఉన్నవారికి జీర్ణ క్రియ కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి.. అది పూర్తిస్థాయిలో మెరుగుపడుటకు మంచి నీరు అవసరం. మూత్రపిండాలు, కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది.

వ్యర్థాలను తొలగిస్తుంది..

మంచినీరు శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు ఉయోగపడుతుంది. ముఖ్యంగా మన శరీరంలో ఉన్న టక్సీన్లను యూరిన్ ద్వారా బయటకు వెళ్లగొట్టేందుకు సహాయం చేస్తుంది. దీంతో మన శరీరంలోని అనవసర కొవ్వు పదార్ధాలు తొలగిపోతాయి. తద్వారా బరువు తగ్గవచ్చు.

 

చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

శరీరంలోని కణాలు.. ఫ్లూయడ్స్, ఎలక్ట్రోలైట్స్ ని సమతుల్యం చేస్తుంటాయి. దీని వల్ల కండరాలు అలసిపోతుంటాయి. అలా జరగకుండా ఉండేందుకు మంచి నీరు దోహదపడతాయి. డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని  రక్షిస్తుంది. కండరాలు బలపడేందుకు తోడ్పడతాయి. చాలా మంది బరువు తగ్గడం ద్వారా.. చర్మం సాగినట్టుగా తయారువుతుంది. అయితే.. మంచి నీరు తాగడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు.

 బరువు తగ్గిస్తుంది..

మంచి నీరు ఎక్కువగా తీసుకోవడం ద్వారా.. బరువు తగ్గవచ్చు. నీరు తాగడం ద్వారా.. అది ఆకలిని నియంత్రిస్తుంది. వీటిలో క్యాలరీల శాతం సున్నా.. శరీరంలోని కొవ్వు శాతాన్ని కరిగిస్తుంది.

మీరు కూడా బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. మంచి నీళ్లు తాగడం ప్రారంభించండి.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader