అమెరికాలో తెలుగోళ్లు ఇలా చేస్తే దాడులుండవట !

dont Talk in telugu in usa says tata
Highlights

  • తెలంగాణ అమెరికా అసోసియేషన్ ( టాటా ) సూచన

 

జాతి విద్వేశం... అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న కూచిభొట్ల శ్రీనివాస్ ను పొట్టనబెట్టుకుంది.

 

తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారంటూ ఇటీవల అక్కడి యువత పొరుగుదేశాల ప్రజలపై మండిపడుతున్నారు. కొందరైతే తుపాకీ చేతబట్టి ప్రాణాలనే తీస్తున్నారు.

 

ట్రంప్ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షపీఠం అధిరోహించాడో అప్పటి నుంచి ఈ విద్వేషపు ముఠా ఆగడాలకు హద్దే లేకుండా  పోయింది.

 

శ్రీనివాస్ మరణంతో తెలంగాణ అమెరికా అసోసియేషన్ ( టాటా ) మేల్కొంది.  అక్కడున్న తెలుగువారి కోసం కొన్ని సూచనలు చేసింది.

 

అమెరికాలో ఏదైనా పబ్లిక్ ప్రదేశాలకు తెలుగువాళ్లు వెళ్లిన్నప్పడు అక్కడి అందరు ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని సూచించింది.

 

మాతృభాష మీద మనకు అభిమానం ఉండటం సహజమే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్తైనా మనల్ని మనం రక్షించుకునేందుకు తెలుగులో మాట్లాడాటం మానేసి వారి భాషలోనే మాట్లాడాలని పేర్కొంది.

 

వేరే భాషలో మాట్లాడటం వల్ల స్థానికులు మనవాళ్లను అనుమానాలతో చూస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని తెలిపింది.

 

అలాగే, స్థానికులతో ఏ విషయాలపై కూడా వాదులాటకు దిగడం మంచిదికాదని, అలాంటి పనులు చేయోద్దని కోరింది.

 

నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలని సూచించింది.

 

ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో చాలా ఇబ్బందులను అధిగమించొచ్చని పేర్కొంది.

loader