Asianet News TeluguAsianet News Telugu

ఇక‌ కారు డ్రైవర్ నిద్ర‌పోవ‌డం అసాధ్యం

  • కారు ఏసీ డ్రైవర్ ని నిద్రపోనివ్వదు.
  • నూతన టెక్నాలజీని మార్కెట్ లోకి తీసుకొచ్చిన పానాసోనిక్.
dont sleep driver in this car because AC will gave alert

సాధార‌ణంగా కారు యాక్సిడెంట్స్ జ‌ర‌గ‌టానికి ప్ర‌ధాన కార‌ణం డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం. అందుకు డ్రైవర్ తాగి న‌డ‌ప‌డం, అదీ కాదంటే డ్రైవింగ్ చేస్తు నిద్ర‌పోవ‌డం. అయితే ఇక మీద‌ట ఈ కారు డ్రైవింగ్ చేస్తున్న‌ప్పుడు డ్రైవ‌ర్‌ను నిద్ర‌పోనీవ‌దు. అదేంటి కారు నిద్ర‌పోనివ్వ‌క‌పోవ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ విష‌యం తెలుసుకొని తీరాలి.

పానాసోనిక్ నూత‌న ఏసీని మార్కెట్ లోకి విడుద‌ల చేసింది. ఆ ఏసీ ఇంట్లోకి వాడ‌టానికి కాదండోయ్‌, కేవ‌లం కారులో మాత్ర‌మే వాడుకోవ‌చ్చు. ఈ ఏసీ ప్ర‌త్యేక‌త‌ ఏంటంటే కారు డ్రైవింగ్ చేస్తూ నిద్రిస్తున్న డ్రైవ‌ర్‌ని మేల్కోప‌డం. పానాసోనిక్ కంపేనీ ఏసీని సెన్సార్ల‌తో అనుసంధానించారు. డ్రైవింగ్ సీటు ముందు ఒక కెమెరాను, 1 నుండి 5 వ‌ర‌కు ఉండే సూచిక‌ను అమ‌ర్చారు. అందులో అమ‌ర్చిన‌ కెమెరా మ‌నం డ్రైవింగ్ చేస్తున్న‌ప్పుడు అనుక్ష‌ణం క్యాప్ష‌ర్ చేస్తుంది. ముందుగానే 1800 రకాల మాన‌వ ముఖ క‌వ‌లిక‌ల‌ను ఈ ఏసీలో పొందుప‌ర్చారు. ముక్కు, నాలుక‌, క‌ళ్లు, నుదురు, పెదాలు, వీట‌న్నింటిని స్కాన్ చేసి ఈ ఏసీకి కొడింగ్ రూపంలో అమర్చారు. మ‌న ముఖం పై ఉన్న క‌వ‌లిక‌లు అందులో ఏదో ఒక కోడింగ్ కి త‌ప్ప‌కుండా మ్యాచ్ అవుతాయి. 


 కారు డ్రైవ‌ర్ నిద్రిస్తుంటే, త‌న ముఖ‌క‌వ‌లిక‌ల‌ను బ‌ట్టి అందులో ముందుగానే స్టోర్ చేసిన వాటితో మ్యాచ్ అయి...త‌క్ష‌మే బ‌య‌టికి అధిక శ‌బ్ధంతో అల్లారం వ‌స్తుంది. అప్ప‌టికి ఆ డ్రైవ‌ర్ నిద్ర‌లేవ‌క‌పోతే ఆ ఏసీ డ్రైవ‌ర్ కి చుట్టు కొంత వేడి గాలిని పంపిస్తుంది. అప్పుడు ఆ డ్రైవ‌ర్ ఆల‌ర్ట్ అవుతాడు. సో మీ కారు ఏసీ మిమ్మ‌ల్ని గ‌మ‌నిస్తుంది.


ఈ ఏసీలో మ‌రో కొన్నీ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తోంది. మీరు న‌డ‌పుతున్న కారు బాగా హీటైతే, త‌క్ష‌ణ‌మే మీకు కారులో ఉన్న 1 నుండి 5 ర‌కాల సూచిక‌లో చూపిస్తుంది. మీరు బాగా వేగంగా వెళ్తే ఈ ఏసీ మీకు డెంజ‌ర్ అని సందేశాన్ని అందిస్తుంది. కారుకు ఏవైనా వాహానాలు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చినా ఈ ఏసీ మిమ్మ‌ల్ని అల‌ర్ట్ చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios