చెన్నై హోటల్లలో బిర్యానీ అంతా కల్తీనే పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా పరిశీలనలో వెల్లడి
చెన్నైలో దిగగానే ఇకపై బిర్యానీ ఘుమఘుమలకు పడిపోకండి. ఎందుకైనా మంచిది సాంబర్ ఇడ్లీతో సరిపెట్టండి.
అక్కడ మీరు చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తే కుక్క బిర్యానీ వడ్డిస్తున్నారట.
ఇప్పటి వరకు ఇదంతా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ మాత్రమే అనుకున్నారంతా.. కానీ, ఇదే విషయం నిగ్గు తేల్చేందుకు ‘పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా’ (పీఎఫ్‌సీఐ) నిర్వాహకులు రంగంలోకి దిగారు.
చెన్నైలోని పలు హోటళ్లలో పరిశీలించారు. చివరికి ఇదే నిజమేనని నిర్ధారించారు. అంతేకాదు అక్కడ తోపుడు బండ్ల మీద విక్రయించే బిర్యానీలో పిల్లి మాంసంను కలుపుతున్నట్లు కూడా తమ పరిశీలనలో వెల్లడైనట్లు చెప్పారు.
పిల్లులను విక్రయిస్తున్న పలువురు సంజారజాతుల వ్యక్తులను అదుపులోకి తీసుకుని, పోలీసులకు అప్పగించడంతోపాటు పలు పిల్లులను రక్షించారు.
గతంలో బెంగళూరులో కూడా ఇలా బిర్యానీలో కుక్క, పిల్లి మాంసం కలుపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.
