మీ ఫేస్ బుక్ ఎకౌంట్ సేఫ్ గా ఉందోలేదో తెలుసుకోండి అంటూ.. గత రెండు మూడు రోజులుగా ఫేస్ బుక్ లో ఓ పోస్టు సర్క్యూలేట్ అవుతోంది. ఫేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ ఫోటో పెట్టి.. ఆ పోస్టు కింద కామెంట్ లో BFF అని టైప్ చేయాలి. అది గ్రీన్ కలర్ లో వస్తే మీ ఎకౌంట్ సేఫ్ అని అలా రాకపోతే.. మీ ఎకౌంట్ హ్యాకింగ్ కి గురయ్యే ప్రమాదం ఉంది.. వెంటనే పాస్ వర్డ్ మార్చండి అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని చాలా మంది నమ్మేసి నిజంగానే BFF అని కామెంట్ చేయడం.. కలర్ గ్రీన్ లోకి మారకపోతే.. పాస్ వర్డ్ మార్చేస్తున్నారు. అయితే.. ఇది నిజంగా నిజం కాదని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి పోస్టులను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరి BFF అని పోస్టు చేయగానే కలర్ మారుతోంది కదా.. మరి ఇదెలా జరుగుతోంది అనే అనుమానం మీకు రావచ్చు. దీని వెనుక కూడా ఓ టెక్నిక్ ఉంది. అదేంటి అంటే.. ఈమధ్య ఎవరికైనా మీరు congratulations అని మెసేజ్ టైప్ చేస్తే అవి వేరే కలర్‌ కోడ్‌లో ప్రత్యేకంగా కనపడటం గమనించే ఉంటారు. అలాంటి పదాలమీద మనం టాప్ చేసినప్పుడు వెంటనే బెలూన్లు గానీ, హార్ట్ సింబల్ గానీ యానిమేట్ అవుతూ చూపించబడుతుంది. ఇలా కొన్ని పదాలకు కొన్ని ప్రత్యేక రంగులు చూపించబడేలా అక్టోబర్ 2017 లో ఫేస్ బుక్ సంస్థ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.

సరిగ్గా ఆ క్రమంలో BFF అనే పదానికి కూడా అది గ్రీన్ కలర్‌లో కనిపించేలా ఏర్పాటు చేశారు. BFF అంటే best friend forever అనే పూర్తి పదానికి సంక్షిప్త రూపం. అంటే మనం ఎవరి పోస్ట్ క్రిందైనా కామెంట్ చేస్తూ BFF అని టైప్ చేశామంటే వారు మనకు అత్యంత ఆప్తులైన స్నేహితులు అని పరోక్షంగా చెప్పినట్లు అన్నమాట. దాంతో ముందే చేయబడిన ఏర్పాటు వల్ల అది సహజంగానే గ్రీన్ కలర్ లో కన్పిస్తుంది. అంతే కాదు.. కొద్దిగా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే, ఆ BFF అనే పదం మీద వేలితో ట్యాప్ చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు చేతులు కలిపినట్లు కన్పిస్తుంది. అంటే స్నేహితులు అన్నమాట. ఇకపోతే కొంతమందికి BFF అని టైప్ చేస్తే కలర్ మారదు. అలాగని వాళ్ల అకౌంట్ హ్యాక్ అయినట్లు కాదు. ఈ కలర్ కోడ్స్ అనేవి కొత్త బ్రౌజర్, ఫేస్ బుక్ యాప్‌లో మాత్రమే CSS రెండరింగ్  ద్వారా సాధ్యపడతాయి. ఇప్పటికీ పాత వెర్షన్ల ఫేస్ బుక్ యాప్, బ్రౌజర్ వాడుతున్న వారికి అప్‌డేట్ కావు. కొంతమంది యాప్‌లో క్యాచీ ఇష్యూస్ వల్ల కూడా రంగు మారదు. కాబట్టి ఇలాంటి పోస్టులను నమ్మకండి.