అలా చెప్పడం మంచిదేనట..!

First Published 23, Dec 2017, 2:50 PM IST
does age affect on sex
Highlights
  • వయసు తక్కువగా చెప్పడం వల్ల సెక్స్ బాగా ఎంజాయ్ చేయగలరని తాజా పరిశోధనలో వెల్లడైంది.

మీ వయసెంత..? అని ఎవరైనా అడిగితే.. చాలా మంది వారి అసలు వయసు కన్నా.. ఒకటి, రెండు సంవత్సరాలు తక్కువగా చెప్పుకుంటారు. వయసు పెరగలేదు.. ఇంకా యంగ్ గానే ఉన్నామనే ఫీలింగ్ కోసం చాలా మంది అలా చెప్పుకుంటారు.  అయితే.. అలా చెప్పడం కూడా ఒకింత మంచిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు చదివింది నిజమే.. వయసు తక్కువగా చెప్పడం వల్ల సెక్స్ బాగా ఎంజాయ్ చేయగలరని తాజా పరిశోధనలో వెల్లడైంది.

వాటర్‌లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల 40-60 ఏళ్ల వయసువారిలో శృంగార ధోరణులపై ఒక అధ్యయనం చేసి మరీ దీన్ని గుర్తించారు. అసలు వయసుతో పోలిస్తే మానసికంగా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని మరింత బాగా ఆస్వాదిస్తున్నట్టు తేల్చారు. అంటే దీనర్థం ఇలాంటివాళ్లు ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటున్నారని కాదు. శృంగారానుభూతి విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారనే. వయసుతో పాటు వచ్చే దీర్ఘకాల సమస్యలను పరిగణనలోకి తీసుకొని చూసినా కూడా తక్కువ వయసులో ఉన్నామని భావించేవారు శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదిస్తుండటం విశేషం. వయసు తక్కువని భావించేవారు సహజంగానే చురుకుగా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివీ వీరిలో ఎక్కువే. ఇవన్నీ బలమైన లైంగిక వాంఛలు కలగటానికి, శృంగారాన్ని ఆనంద సాధనంగా భావించటానికి పురికొల్పుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

 
 

loader