హార్ట్ స్పెషలిస్ట్ .. హార్ట్ ఎటాక్ తోనే చనిపోయింది ఇలా(వీడియో)

First Published 19, Mar 2018, 5:35 PM IST
doctor died due to cardiac arrest in mumbai hospital
Highlights
  • విధి నిర్వహణలోనే కన్నుమూసింది

డాక్టర్ గా ఎంతో మందికి సేవచేసింది గుండె నిపుణురాలిగా.. ఇంకెంతో మంది గుండె ఆగిపోకుండా కాపాడగలిగింది.  చివరకు ఎక్కడైతే వేల మంది ప్రాణాలను నిలిపిందో.. అక్కడే తన తుదిశ్వాస విడిచింది. ముంబయిలోని వినాయక్ హాస్పిటల్ లో ఓ వైద్యురాలు విధులు నిర్వహిస్తూనే చనిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్ పేరు సునీత. హార్ట్ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. కాగా.. ఆమె ఈరోజు హఠాత్తుగా కన్నముశారు. రోజులాగానే విధులకు హాజరైన ఆమె.. ఆస్పత్రిలో మరో డాక్టర్ తో కలిసి ఫైల్స్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఉన్నచోటే ఆమె కుప్పకూలారు. అంతే వెంటనే ఆమె గుండె ఆగిపోయింది. పక్కనే చాలా మంది డాక్టర్లు, నర్సులూ ఉన్నప్పటికీ ఎవరూ కాపాడలేకపోయారు. ఈ ఘటనంతా.. సీసీటీవీ లో రికార్డ్  అయ్యింది. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.

loader