ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా నగరంలో మహిళా ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. షీ టీమ్ లు ఎంత మందిని పట్టుకుని కౌన్సెలింగ్ లు చేసినా, శిక్షలు విధించినా మార్పు మాత్రం రావడం లేదు. బస్టాపుల్లో,  షాపింగ్ మాల్స్, రోడ్లపై ఇలా ఎక్కడపడితే అక్కడ మహిళలు వేదింపులకు 

గురవుతున్నారు. ఆ వేధింపుల సంస్కృతి ఇపుడు మెట్రోకు పాకింది.

రిటైర్ మెంట్ తర్వాత సీతా రామ అంటూ గడపాల్సిన ఓ వృద్దుడు మెట్రో రైలులో మహిళల ఫోటోలను సెల్ ఫోన్ లో సీక్రెట్ గా తీస్తూ షీ టీమ్ పోలీసులకు చిక్కాడు.  పెద్ద అంబర్‌పేట్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ నివాసి ఎన్. నరసింహ(65) విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. అయితే ఇవాళ అతడు ఉప్పల్ నుంచి నాగోలు కు వెళ్తున్న మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఎదురుగా కూర్చున్న అమ్మాయిల ఫోటోలను సీక్రెట్ తీస్తున్నాడు. దీన్ని గమనించిన యువతులు షీ టీమ్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు నాగోల్ స్టేషన్ లో ఈ వృద్దుడిని పట్టుకున్నారు. సెల్ ఫోన్ ను తీసుకుని పరిశీలించి పోటోలు తీసినట్లుగా దృవీకరించుకున్న పోలీసులు నరసింహను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.