బ్రేక్ ఫాస్ట్ ఉదయం చేయాలి.. లంచ్ మధ్యాహ్నం చేయాలి.. డిన్నర్ రాత్రి పూట చేయాలి అనే నియమాలు ఉన్నట్లు శృంగారానికి నియమాలు ఏమీ లేవు అంటున్నారు నిపుణులు. కాకపోతే.. దాదాపు అందరూ.. రాత్రి పూటకే ఎక్కువ ప్రిఫెరన్స్ ఇస్తారు. అయితే.. తాజా పరిశీలనలో దీని గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సెక్స్ లో ఒక్కొక్కరు ఒక్కో సమయంలో పాల్గొంటూ ఉంటారు. చాలా మంది రాత్రి వేళల్లోనే సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. అయితే రాత్రి పూట కంటే తెల్లవారుజామున, ఉదయం పూట సెక్స్ లో పాల్గొంటే మంచి థ్రిల్ వస్తుందంట. అందులో బాగా సంతృప్తి చెందవచ్చట. ప్రపంచంలో చాలా మంది మార్నింగ్ సెక్స్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారట.

మీరు రోజంతా బయట ఎక్కడొక్కడో తిరిగి, ఆఫీసులో పని చేసి, ప్రయాణం చేసి, ఇంటి బాధ్యతల గురించి ఆలోచించి రాత్రి ఇంటికి చేరుకుంటారు. దీంతో చాలా అలసిపోయి ఉంటారు. మైండ్ కూడా అంత ఫ్రెష్ గా ఉండదు. ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోయి ఉంటారు. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోవాలని భావిస్తారు. రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోయి, ఉదయం ఉత్సాహంగా మేల్కొంటారు.

మార్నింగ్ సెక్స్ అనేది భాగస్వాములిద్దరికీ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ సమయంలో మీ మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే, ఉదయంపూట భావప్రాప్తిని ఇద్దరూ బాగా పొందగలుగుతారు. దీని వల్ల మీరు ఆ రోజంతా ఎలాంటి స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా గడపవచ్చు. ఈ విషయం చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

ఉదయంపూట టెస్టోస్టెరాన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఆ టైమ్ లో మీరు సెక్స్ లో పాల్గొంటే ఆక్సిటాక్సిన్ విడుదలవుతుంది. ఇది మీలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తుంది. అలాగే అప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్ హార్మోన్లు మీ భాగస్వామి రోజంతా సంతోషంగా ఉంచేందుకు దోహదపడతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుందట.