పక్షుల కోసం క్రాకర్స్ కాల్చడం ఆపేసిన గ్రామస్థులు పెద్ద పెద్ద శబ్ధాలు ఏమీ రాకుండా జాగ్రత్త తీసుకుంటున్న గ్రామస్థులు

తమకు ఇష్టమైన వారి కోసం చాలా మంది చాలా వదిలేసుకుంటారు. తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా చాలా వాటిని త్యాగం చేశారు. అది కూడా కేవలం పక్షుల కోసం. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజం.

దీపావళికి బాంబులు కాలిస్తే.. జంతువులు భయపడతాయని.. చాలా మంది జంతు ప్రేమికులు.. క్రాకర్స్ కాల్చవద్దు అని ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాటిని పాటించేవారి సంఖ్య చాలా అరుదు. మన సంతోషం కన్నా.. ఆ నోరులేని ముగజీవాలు ముఖ్యమా అని ఫీలయ్యేవాళ్లు కూడా ఉంటారు. కానీ తమిళనాడులోని కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం ఒకే మాట మీద దీపావళికి క్రాకర్స్ కాల్చడం లేదు.

తిరునెల్వేలి జిల్లాలోని కుతాంకులం అనే గ్రామంలో పక్షుల అభయారణ్యం ఉంది. దానిలోని పక్షులకు హాని కలగకుండా ఉండేందుకు దీపావళి టపాసులను కాల్చడం ఆపేశారట.

మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. క్రాకర్స్ కాల్చకపోవడమే కాదు.. ఆ గ్రామాల్లో లౌడ్ స్పీకర్లు కూడా పెట్టరు. ఆ గ్రామంలో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రశాతంగా చేస్తారు. అక్కడ ఫ్లెమింగో, పెలికాన్, స్పూన్ బిల్, పెయింటెడ్ స్టోర్క్, ఈగర్ట్, డక్, టెర్న్ లాంటి రకరకాల పక్షి జాతులు ఉన్నాయి.

 అదేవిధంగా సేలమ్ జిల్లాలోని వివిల్ తోపు అనే గ్రామం, పెరంబూర్, నాగపట్నం, కాంచీపురం గ్రామాల్లో కూడా గబ్బలాలు భయపడతాయని క్రాకర్స్ కాల్చడం నిషేధించారు. చాలా సంవత్సరాల నుంచి వీరు ఈనియమాన్ని పాటిస్తున్నారు.

ఆ గ్రామాల్లో కేవలం పిల్లలు ఆడుకునే గన్ తుపాకీ చప్పుళ్లు తప్ప.. వేరే శబ్ధాలు ఏమీ వినిపించవు. వెలుగులు వెదజిమ్మే క్రాకర్లను మాత్రమే కాలుస్తారు. 18 సంవత్సరాల నుంచి దాదాపు 8గ్రామాల్లో శబ్ధాలు వచ్చే బాంబులు పేల్చడం నిషేధించారని 65ఏళ్ల కుప్పన్న అనే వ్యక్తి తెలిపారు.