హిందూ సాంప్రదాయం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది.. మహిళల నదుటున బొట్టు. ఒకప్పుడు మహిళలునుదుటిన కుంకమ, తిలకం లాంటివి పెట్టుకునేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. దీంతో ఎవరూ తిలకాన్ని , కుంకుమను పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. వాటి స్థానంలో మార్కెట్ లో రెడీమెడ్ గా లభించే బొట్టుబిల్లలను పెట్టుకుంటున్నారు. అందులోనూ అవి రకారకాల మోడల్స్, భిన్నంగా ఆకట్టుకునే రీతిలో ఉండటంతో యువతులు, మహిళలు వాటికే ఓటు వేస్తున్నారు.

హిందూ సాంప్రదాయానికి విదేశీయులు కూడా ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది విదేశీ మహిళలు మన చీరకట్టు, బొట్టు తో సింగారించుకొని మురిసిపోతుంటారు. ఈ విషయం పక్కన పెడితే.. అసలు ఆ  బొట్టు బిల్లలు పెట్టుకోవడం మంచిది కాదట. ఫ్యాషన్ మోజులో పడి వాటికి ఈతరం యువతులు, మహిళలు వాటినే వాడుతున్నారు కానీ.. వాటికన్నా సింధూరమే చాలా మంచిదట. దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయనేది నిపుణుల వాదన.

తిలకం, బింది అనేది సంస్కృత పదం బిందు నుంచి వచ్చింది. హిందూ సాంప్రదాయంలో దీనిని చాలా పవిత్రంగా భావిస్తారు. శివుడికి మూడో కన్ను ఉండే స్థానంలో మహిళలు ఈ తిలకాన్ని అలంకరించుకుంటారు. పూర్వకాలంలో పురుషులు కూడా నుదిటిన తిలకం దిద్దుకునే వారు. అయితే.. నుదుటిన పెట్టుకునే తిలకం.. మహిళలకు ఒక శక్తిని ఇస్తుందని పూర్వీకుల నమ్మకం.  అందుకే పూర్వీకులు అందం కోసం తిలకాన్ని దిద్దుకునే వారు కాదు. దానివలన కలిగే ప్రయోజనాల కోసం మాత్రమే. ముఖ్యంగా మహిళలకు వారి శరీరంలోని చక్రాలను సమతుల్యం చేయడానికి, వారి చుట్టూ ఉన్న శక్తిని బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుందట.

రెండు కన్నుబొమ్మల మధ్యలో నుదుటిపైన మాత్రమే కుంకుమ ఎందుకు పెట్టుకుంటారో మనలో చాలా మందికి తెలియదు. దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం నుదురేనట. అంతేకాకుండా ఈ ప్రాంతం శరీరంలోని నాడి, పింగ్ల, షుషుమ్నాలను ఒకే చోట కేంద్రీకరించేలా చేస్తుంది. అంతేకాకుండా మెదడుని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. అందుకే కుంకుమ పెట్టుకోవాలి.

ముఖ్యంగా పూజలు చేసే సమయంలో ఈ బొట్టుబిల్లలు పెట్టుకోకూడదు. కుంకుమను ధరించి పూజలో పాల్లొనాలి. రెండు కనుబొమ్మల మధ్య  స్థలంలో కుంకుమ పెట్టుకొని పూజ చేస్తే.. మీలోని అతీంద్రియ శక్తిని మీకు అందించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కాస్మిక్ శక్తులకు దూరంగా ఉంచుతుంది. ఈ కాస్మిక్ శక్తి.. మెదడును ఇన్ విజబుల్ చేయడం, లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించడం లాంటివి చేస్తుంది. అలా జరిగితే చేసిన పూజకు ఫలితం ఉండదు. అందుకే కుంకుమ ధరించాలి.

యోగా, హోమాలు లాంటివి చేస్తున్నప్పుడు మనిషిలోచి చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అంతేకాకూండా మూడో కన్ను మేల్కోనడం ప్రారంభౌతుంది. ఇలాంటి సందర్భంలోనే చాలా మంది కి నిద్ర వస్తూ ఉంటుంది. కుంకుమ పెట్టుకుంటే మనిషిలోని చక్రాలు మేల్కొంటాయి. అలాకాకుండా స్టిక్కర్లు పెట్టుకుంటే ఆ చక్రాల శక్తి బ్లాక్ అయిపోతాయి.

కాబట్టి... మహిళలు, పురుషులు పూజల సమయంలో సింధూరం, కుంకుమ, పసుపు, గంధం, విబూది లాంటివి పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఈ బొట్టుపిల్లలు మంచి చేయకపోగా.. చెడు చేసే అవకాశం ఉంది.