శ్రీరెడ్డి వివాదంపై స్పందించిన కొరటాల శివ

First Published 15, Apr 2018, 9:49 AM IST
director koratala shiva reaction about srireddy
Highlights
తొలిసారిగా స్పందించిన కొరాటల శివ

నటి, యాంకర్ శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పేరటి సృష్టించిన సంచలనం   అంతా ఇంతా కాదు. తనకు అవకాశాలు ఇస్తామంటూ బడా బడా దర్శకులు, నిర్మాతలు తనను మోసం చేశారంటూ ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతికూడా తెలిసిందే. తనకు ఛాన్సులు ఇస్తానని నమ్మించి మోసం చేసిన వారిలో దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నాడని ఆమె గతంలో ఓ టీవీ ఛానల్  ఇంటర్వ్యూలో చెప్పింది. ఆమె మాటలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దుమారం కూడా రేపాయి. అయితే.. ఈ విషయంపై కొరటాల శివ మాత్రం పెదవి విప్పలేదు. కానీ.. తాజాగా ఈ విషయంపై ఆయన స్పందించారు.

ప్రస్తుతం కొరటాల శివ.. మహేష్ నటించిన భరత్ అను నేను ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. కాగా.. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన  ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయననుశ్రీరెడ్డి విషయంపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పారు. ‘‘ ఈ విషయం గురించి త్వరలోనే మాట్లాడతా. ప్రస్తుతం నా దృష్టంతా సినిమా ప్రమోషన్‌ మీదే.’’ అని తెలివిగా తప్పించుకున్నారు. అయితే.. ఇప్పుడు కాకపోయినా.. సినిమా విడుదల తర్వాత ఈ విషయంపై కొరటాల మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

loader