డ్రగ్ స్కామ్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు  డ్రగ్ స్కామ్‌లో టిఆర్‌ఎస్ నేత కెటిఆర్  మిత్రులకు   సంబంధం ఉంది. విచారిస్తారో కాపాడుతారో చూడాలి

 కెసిఆర్, కెటిఆర్ ను తెలంగాణా రాష్ట్రసమితిని గిల్లుకోవడం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సరదా. అవకాశం వచ్చినపుడల్లా ఆయన టిఆర్ ఎస్ ప్రభుత్వం ట్వీట్ విసురుతూ ఉంటారు. ముఖ్యంగా టిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి మీద డిగ్గీ రాజా అడుకుంటుంటారు. దీని కి రెచ్చిపోయి, కేసుపడతామని కెటిఆర్ హెచ్చరిస్తూంటారు. ఈ సారి డిగ్గీ రాజా ఈ సారి డ్రగ్స్ మీద కు దృష్టి మళ్లించారు.

సినిమా రంగాన్ని, తెలంగాాణాని కుదిపేస్తున్న డ్రగ్ స్కామ్‌పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.డ్రగ్ స్కామ్‌లో బాగా పలుకుబడి ఉన్న ఆర్‌ఎస్ నేత కెటిఆర్ మిత్రులకు సంబంధం ఉందని డిగ్గీ ట్వీట్ చేశారు. ఈ స్కామ్‌తో సంబంధమున్న నేతలను విచారిస్తోరో లేక కాపాడుతారో వేచి చూడాలని ఆయన పేర్నారు.

ఈ ట్వీట్ చురక తెలంగాణా ఐటి మంత్రి కెటిఆర్ కు నచ్చలేదు. ఆయన వెంటనే ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చారు.

Scroll to load tweet…

దిగ్విజయ్ సింగ్ ఇక రిటైర్ కావడం మంచిదని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

Scroll to load tweet…