నీపా వైరస్ తో మృతి: భర్తకు లినీ హృదయం మెలిపెట్టే లేఖ

Died treating Nipah patients, Kerala nurse left touching note for husband
Highlights

నీపా వైరస్ తో మృతి చెందిన నర్సు లినీ పుతుస్సెరీ (31) తన భర్తకు హృదయం ద్రవించే లేఖ రాశారు.

తిరువనంతపురం: నీపా వైరస్ తో మృతి చెందిన నర్సు లినీ పుతుస్సెరీ (31) తన భర్తకు హృదయం ద్రవించే లేఖ రాశారు. నీపా వైరస్ రోగికి చికిత్స అందిస్తూ ఆమె మరణించిన విషయం తెలిసిందే. సమోవారం ఆమె పెరంబర ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. 

"దాదాపుగా నేను వెళ్లిపోతున్నా. మన పిల్లలను జాగ్రత్తగా చూసుకో" అని భర్తకు ఆమె లేఖ రాసింది. వైరస్ వ్యాపించకుండా ఆమెకు కుటుంబ సభ్యుల అనుమతితో వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. 

"సాజీ చెట్టా, నేను వెళ్లిపోతున్నాను. మిమ్మల్ని చూస్తానని అనుకోవడం లేదు. సారీ. మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వారిని గల్ఫ్ కు తీసుకుని వెళ్లు. మా తండ్రి లాగా వారు ఒంటరిగా ఉండకూడదు. లాట్స్ ఆఫ్ లవ్" అని రాసింది. 

"రోగికి చికిత్స అందిస్తూ తన ప్రాణాలను త్యాగం చేసిన లినీ మృతి మనందరికీ విషాదకరమైన సంఘటనే. లినీ త్యాగాన్ని అనన్య సామాన్యమైంది. నిజాయితీగా తన విధులు నిర్వహిస్తూ లినీ ఈ ప్రమాదానికి గురైంది. ఈ రాష్ట్ర ప్రజలుగా లినీ కుటుంబానికి, మిత్రులకు, సహోద్యోగులకు కలిగిన బాధను పంచుకుందాం" అని ముఖ్యమంత్రి పినరయి రవి విజయన్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు 

loader