Asianet News TeluguAsianet News Telugu

అటుకులతో అద్భుతమైన పొంగల్

  • ఈ అటుకుల పొంగల్ గురించి ఎప్పుడైనా విన్నారా..?
did you taste yummy atukula pongal

వరి ధాన్యం నుంచి అటుకులు తయారు చేస్తారు. ఒకప్పుడు అటుకులు పాలల్లో వేసుకొని తినేవారు. ఇప్పుడు అదే అటుకులను పొహ గా చేసుకొని తింటున్నారు. అటుకులతో కేవలం పొహనే కాదు.. ఇంకా చాలానే తయారు చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దామా..

బియ్యంతో పొంగల్ ఎలా చేస్తారో మన అందరికీ తెలిసు. మరి ఈ అటుకుల పొంగల్ గురించి ఎప్పుడైనా విన్నారా..? మీ నాలుకకి రుచి చూపించారా? అతి తక్కువ సమయంలో చేయగల స్వీట్ ఇది. కిచెన్ లో వంట చేయడానికి ఎక్కువ సమయం కేటాయించలేని సమయంలో ఇది చేసుకోవచ్చు. రుచికి రుచిగానూ.. తక్కువ టైమ్ లో అయిపోతుంది. తయారు చేయడం కూడా చాలా సులవు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ సమయంలోనైనా దీనిని ఆరగించవచ్చు. మరి దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దామా...

కావాల్సిన పదార్ధాలు: 1.అటుకులు -ఒక కప్పు 2.పెసర పప్పు-పావు కప్పు 3.న్నీళ్ళు-4 కప్పులు 4.పసుపు-చిటికెడు 5.అల్లం-సన్నగా తరిగినది ఒక తేబుల్ స్పూను 6.జీడి పప్పులు-8 7.నల్ల మిరియాలు-ఒక తేబుల్ స్పూను 8.ఉప్పు-రుచికి తగినంత 9.పచ్చి మిర్చి-2 పోపు కోసం: 1.నూనె-2 టేబుల్ స్పూన్లు 2.కరివేపాకు-ఒక చిన్న కట్ట 3.నెయ్యి-2 టేబుల్ స్పూన్లు 4.జీలకర్ర-2 టీ స్పూన్లు 5.ఇంగువ-చిటికెడు

తయారీ విధానం: 1. ఒక మూకుడూ తీసుకుని నూనె వెయ్యకుండా వేడీ చేసి పెసరపప్పు దోరగా కమ్మటి సువాసన వచ్చేవరకూ వేయించాలి.

2.దీనిలో కొంచం పసుపు,నీళ్ళు పోసి పప్పుని మెత్తగా ఉడకనివ్వాలి. పప్పు ఉడికాకా బయటకి తీసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి.

3.అటుకులని బాగా కడిగి,ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి.ఇంతలో జీలకర్ర,మిరియాలని బరకగా దంచుకోవాలి.

4.ఒక మూకుడు తీసుకుని వేడయ్యాకా దానిలో నూనె, నెయ్యి వెయ్యాలి.దీనిలో అల్లం,కరివేపాకు,పచ్చి మిర్చివేసి బాగా వేయించాలి.

5.దీనిలో మిరియాలు,జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడనివ్వాలి.

6.దీనికి మెత్తగా మెదిపిన పప్పు కలిపి ఉప్పు చేర్చాలి.అన్ని దినుసులూ కలిసేలా బాగా కలపాలి.

7.జీలకర్ర తదితర సుగంధ ద్రవ్యాలతో కలిసి పప్పు ఉడికాకా అటుకులు వేసి బాగా ఉడకనివ్వాలి.ఇప్పుడు అన్ని పదార్ధాలు బాగా కలుస్తాయి. 8.ఒక చిన్న మూకుడు తీసుకుని దానిలో నెయ్యి వేసి వేడీ చేసి కరివేపాకు,ఇంగువ, జీడిపప్పు వేసి ఈ పోపుని ఉడికిన బియ్యం,పప్పు మిశ్రమం మీద చేస్రిస్తే రుచికరమైన పొంగల్ రెడీ.

Follow Us:
Download App:
  • android
  • ios