ఓట్స్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ ని ఎంచుకుంటుంటారు. అయితే.. ఓట్స్ రుచి అందరికీ నచ్చదు. ఎంత ఆరోగ్యకరమైనవైనా.. రుచిగా లేకపోతే తినడం కష్టమే. అయితే.. వాటిని రెగ్యులర్ గా పాలల్లో ఉడకపెట్టి కాకుండా.. కొంచెం ట్విస్ట్ చేయాలి. అదేనండి కొంచెం డిఫరెంట్ గా తయారు చేస్తే సరిపోతుంది.

 ఓట్స్ లో ఫైబర్ , కార్బోహైడ్రేట్స్, స్ట్రార్చ్ ఎక్కువగా ఉంటుంది . కాబట్టి, ఆరోగ్యానికి మంచిది. డైట్ ను అనుసరించే వారు, బరువు పెరగకుండా ఉండాలంటే, ఓట్స్ తో తయారుచేసిన ఆహారాలను తీసుకోవాలి.  ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ రెసిపీ అయిన ఓట్స్ టిక్కీ ఎలా తయారుచేయాలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

1.రోల్డ్ ఓట్స్ - 1 cup 2. కాటేజ్ చీజ్ - ¼th cup (తురిమినది) 3. క్యారెట్ - ¼th cup (తురిమినది) 4. బంగాళదుంపలు - ½ cup (ఉడికించి, మ్యాష్ చేసినవి) 5. కొత్తమీర - 2 tbsp (సన్నగా తరిగినవి) 6.కారం - 1 tsp 7. నిమ్మరసం - 1 tsp
8. అల్లం పేస్ట్ - 1½ tsp 9.పచ్చిమిర్చి పేస్ట్ - 1½ tsp 10. గరం మసాలా - 1 tsp 11. మ్యాంగో పౌడర్ - 1 tsp 12.ఉప్పు రుచికి సరిపడా 13. లోఫ్యాట్ మిల్క్ - ¼th cup 14. నూనె - 1½ tbsp

తయారు చేయు విధానం..

1.ఒక బౌల్లో ఓట్స్ తీసుకోవాలి. అందులో పనీర్, క్యారెట్స్, పొటాటో, కొత్తిమీర తరుగు, లెమన్ జ్యూస్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కారం, గరం మసాలా, మామిడి పౌడర్, ఉప్పు వేయాలి.

2.ఈ పదార్థాలన్నింటిని బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు చిలకరించి, మళ్లి మిక్స్ చేయాలి

3.ఇప్పుడు, కలుపుకున్న మిశ్రమంలో కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, టిక్కీలా ఒత్తుకుని, అన్ని ప్లేట్ లో పెట్టుకోవాలి.

4.టిక్కీని పాలలో డిప్ చేసి, ఓట్స్ పౌడర్ లో రోల్ చేసి పెట్టుకోవాలి.

5.ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. పాన్ వేడిఅయ్యాక నూనె రాయాలి. తర్వాత టిక్కీ ని ప్లాన్ లో పెట్టి రెండి వైపులా నూనె వేస్తూ నిధానంగా కాల్చుకోవాలి. 

6.కట్ లెట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారుతుందో అప్పుడు, స్టౌవ్ ను ఆఫ్ చేసి, ప్లేట్ లో కట్ లెట్ ను తీసి పెట్టుకోవాలి..

7.అంతే వేడి వేడి టిక్కీ రెడీ. దీన్ని కొత్తిమీర లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ ఓట్ మీల్ రిసిపి రెడీ..