ఆఫీసులో ఓ మహిళతో రాసలీలు చేస్తూ.. ఓ డీఎఫ్ వో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా డీఎఫ్ వో వెంకటేశ్వరరావు  గత కొంతకాలంగా ఆఫీసులో మహిళలను అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఈ విషయంపై పలు విద్యార్థి సంఘాలు వెంకటేశ్వరరావుకి వ్యతిరేకంగా  పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించాయి. దర్యాప్తులో భాగంగా మంగళవారం డీఎఫ్ వో కార్యాలయాన్ని తనిఖీ చేయగా.. ఒక స్త్రీతో రాసలీలలు చేస్తూ పట్టుబడ్డాడు. డీఎఫ్ వోని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.