ఆంధ్ర తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాశ్ ?

First Published 11, Dec 2017, 2:09 PM IST
Devineni Avinash to head Andhra pradesh Telugu Yuvath
Highlights

దేవినేని కుటుంబానికి పార్టీలో పెద్ద గుర్తింపు

దేవినేని అవినాశ్ కు తెలుగుదేశం పార్టీలో ప్రతిష్టాత్మక బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికందున్న సమాచారం ప్రకారం అయన ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత అధ్యక్షులు కానున్నారు. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకనిర్ణయం తీసుకున్నారని, రెండు మూడు రోజులలోనో ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. తండ్రి దేవినేని నెహ్రూ ఈ ఏడాది ఏప్రిల్  లో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన పోవడం కృష్ణా జిల్లా పార్టీలో కొంత వెలితి ఏర్పడింది.ఇపుడు అవినాశ్ ను పార్టీ స్ట్రక్చర్ లోకి తీసుకోవడంతో ఆన తండ్రి లేని కొరత తీరుస్తాడని అనుకుంటున్నారు. జిల్లాయువనాయకులలో అవినాశ్ చాలా చురుకైన నాయకుడు, మంచి అనుచర వర్గం కూడా ఆయనకు ఉంది. దీనికి తోడు ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ టీమ్ లో బాగా ఇమిడిపోయాడు. లోకేశ్ కు బాగా నమ్మకస్తుడు కూడా అయ్యారు.   ఈ కుటుంబం పలుకుబడి ని పార్టీ పరిధిలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినాశ్ కు చాలా కీలకమయిన బాధ్యత అప్పచెబుతున్నారు. 2019 ఎన్నికల ముందు ఈ బాధ్యతలు ఇస్తున్నందున అవినాశ్ మీద బరువుగా బారీగా ఉంటుందని అంతా అంటున్నారు.

 

 

 

 

 

 

loader