Asianet News TeluguAsianet News Telugu

మూడు రోజులు... రూ.వెయ్యి కోట్లు

  • రాష్ట్ర వ్యాప్తంగా పందెం కోళ్లు రెచ్చిపోయాయి.
  • పగలు రాత్రి తేడా లేకుండా.. మూడు రోజులు జాతర లాగా చేశారు.
  • ఒక్కో కోడి మీద వేల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు బెట్టింగ్ లు కాసారు
Despite court orders against cockfights the multi crore betting annual sport is organised in ap

కోర్టులు ఆంక్షలు విధించినా, పోలీసులు నిబంధనలు పెట్టినా.. చివరకు పందెం కోళ్లకు కత్తులు కట్టారు. కాలికి కట్టిన కత్తితో రంగంలోకి దిగిన పందెం కోళ్లు.. రికార్డులు తిరగరాశాయి. కేవలం మూడు రోజుల్లో రూ.వెయ్యి కోట్లు చేతులు మారాయంటే అర్థం చేసుకోవచ్చు.. ఎంతలా పందేలను నిర్వహించారో. కేవలం గోదావరి జిల్లాలో మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా పందెం కోళ్లు రెచ్చిపోయాయి. పగలు రాత్రి తేడా లేకుండా.. మూడు రోజులు జాతర లాగా చేశారు. ఒక్కో కోడి మీద వేల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు బెట్టింగ్ లు కాసారు. కోడి పందేలు నిర్వహిస్తున్న పక్కనే మందు దుకాణాలు కూడా ఏర్పాటు చేశారు. గెలిచిన వాళ్లు వెంటనే తమ వాళ్లకు పార్టీ ఇవ్వడం.. ఓఢిన వాళ్లు.. మరో పందేనికి రెడీ అవ్వడం లాంటివి సర్వసాధారణంగా జరిగిపోయాయి.

కోడి పందేల మొదటి రోజు పోలీసులు కాస్త హడావిడి చేసినా.. రెండో రోజు నుంచి మళ్లీ యాథావిధిగా జరిగిపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలే దగ్గర నుంచి పందేలు కాస్తుంటే.. పోలీసులు మాత్రం ఏం చేస్తారు..? అందుకే వాళ్లు కూడా చూసీ చూడనట్టు వ్యవహరించారు. ఇంకేముంది పందేం రాయుళ్లు మరింత రెచ్చిపోయారు. ఈ మూడు రోజుల కోడిపందాల్లో దాదాపు వెయ్యి కోట్లు చేతులు మారినట్టు లెక్కలేస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే తొలి రెండు రోజుల్లోనే రెండు వందల కోట్ల బెట్టింగ్‌ సాగిందంటున్నారు. కనుమ నాడు ఈ లెక్క.. రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని వందలాది గ్రామాల్లో కోడిబరులు కొనసాగుతున్నాయి. స్థానికులతో పాటు యానాం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచే కాక.. విదేశీయులు సైతం పందాల్లో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గోదావరి జిల్లా నాటుకోడిపై ఇప్పుడు డాలర్ల వర్షం కురుస్తోందంటున్నారు.

కోడి పందేలు నిర్వహిస్తున్నవారిని ఎవరీ అరెస్టుచేయలేదా.. అంటే అరెస్టులు జరిగాయి. కాకపోతే చిన్నా చితకా పందేలు నిర్వహిస్తున్నవారినే అరెస్టు చేసినట్లు సమాచారం. కేవలం పశ్చిమగోదావరి జిల్లాలో 351 కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కువే ఉండి ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios