ఫేస్ బుక్ లైవ్ లో.. యువకుడి ఆత్మహత్యాయత్నం(వీడియో)

First Published 3, Mar 2018, 12:54 PM IST
Denied Permission For Rally Telangana Man Attempts Suicide On Live Video
Highlights
  • వరంగల్ యువకుడి ఆత్మహత్యాయత్నం
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు

ఫేస్ బుక్ లో లైవ్ పెట్టి మరీ.. ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ముస్లిం హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నయూం నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించాలనుకున్నాడు. సిరియాలో జరుగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా ఈ శాంతి ర్యాలీ నిర్వహించాలనుకున్నాడు. దీనికి అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను కోరాడు. ఇంటర్ విద్యార్థుల పరిక్షలు, ఇతర కారణాలను దృష్టిలో ఉంచుకొని.. పోలీసులు ర్యాలీకి నిరాకరించారు.

 

దీంతో.. మనస్థాపం చెంది కిరోసిన్ ఒంటిపై పోసుకొని ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. అయితే.. సన్నిహితులు సద్ధి చెప్పడంతో విరమించుకున్నాడు. మరోసారి పోలీసులను అనుమతి కోరాడు. మళ్లీ నిరాకరించడంతో.. ఫేస్ బుక్ లైవ్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే సమాచారం అందుకున్న స్నేహితులు అతనిని చికిత్స నమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కాగా.. నయూం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

loader