జబ్బుతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు.. అక్కడ డాక్టర్‌ లేడు. ఈలోపే ప్రాణాలు గాల్లోకలిసిపోయాయి! మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లేదు.. ఆటోవాడూ రానన్నాడు.. చేసేదేమీలేక భార్య శవాన్ని భుజాలపై మోస్తూ కిలోమీటర్ల దూరం నడిచివెళ్లాడు.. గుండెలు పిండేసే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటుచేసుకుంది.