డెలివరీ బాయ్ మర్మాంగాన్ని కోయడానికి ప్రయత్నించిన యువతి

First Published 30, Mar 2018, 7:56 PM IST
delivery boy stabbed 20 times recounts brutal attack
Highlights
కత్తితో పొడిచి హత్యాయత్నం

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన సెల్ ఫోన్ సకాలంలో డెలివరీ చేయలేదని ఓ డెలివరీ భాయ్ పై ఇద్దరు అన్నా చెల్లెళ్లు దాడి చేసిన సంఘటన డిల్లీలో చోటుచేసుకుంది. కత్తులతో విచక్షణా రహితంగా పొడవడంతో పాటు షూ లేస్ తో గొంతు బిగించి చంపాలనుకున్నారు. అలాగే ఆ యువకుడి మర్మాంగాన్ని కూడా కోయడానికి ప్రయత్నించారు. ఇలా 20 నిమిషాల పాటు డెలివరీ బాయ్ కి నరకం చూపించారు. ఎలాగోలా వారి బారి నుండి తప్పించుకున్న యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  

డిల్లీకి చెందిన కమల్ దీప్(30) అనే యువతి ఆన్‌లైన్‌లో రూ. 11 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌కు ఆర్డర్ చేసింది. అయితే ఏవో కారణాలతో సెల్‌ఫోన్‌ను డెలివరీ ఆలస్యమైంది. అయితే ఎందుకు లేట్ అవుతుందో తెలపాలని డెలివరీ బాయ్ కేశవ్ కుమార్ సింగ్(21)కు పదేపదే ఫోన్ చేసింది. కానీ అతడి నుండి సరైన సమాధానం రావడంలేదని తీవ్ర ఆగ్రహానికి లోనైంది. చివరకు సెల్‌ఫోన్‌ డెలివరీ చేయడానికి వచ్చిన బాయ్‌పై కమల్ దీప్, ఆమె సోదరుడు జితేందర్ సింగ్(34) ఆగ్రహం వ్యక్తం చేస్తూ కత్తులతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతడిని చంపే ప్రయత్నంలో భాగంగా పురుషాంగాన్ని కోయడానికి ప్రయత్నించింది యువతి. కానీ ఆమె సోదరుడు దీన్ని అడ్డుకున్నట్లు బాధితుడు తెలిపాడు.

సుమారు 20 నిమిషాల పాటు సింగ్ ని హించడంతో అతడు స్పృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న డెలివరీ బాయ్ చనిపోయాడని భావించి ఇంటి బయట మురికి నాలాలో పడేశారు. అయితే డ్రైనేజీలో పడి ఉన్న కేశవ్ కుమార్ సింగ్‌ను ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఈ దాడికి పాల్పడిన అన్నా చెల్లెళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

loader