బతికుండగానే చనిపోయినట్లు దృవీకరించిన వైద్యులు

delhi max docs conclude a  new born dead when it is still alive
Highlights

  • డిల్లీ మ్యాక్స్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు
  • బతికున్న శిశువును చనిపోయినట్లు దృవీకరించిన వైద్యులు
  • ఈ ఘటనతో సీరియస్ అయిన కేజ్రీవాల్

పేషంట్ చనిపోయాక కూడా ఆ విషయాన్ని బైటపెట్టకుండా డబ్బులు లాగే హాస్పిటళ్లను చూసుంటారు. కానీ బతికుండగానే చనిపోయినట్లు దృవీకరించి ఓ  
హాస్పిటల్ వైద్యుల నిర్వాకం తాజాగా డిల్లీలో బైటపడింది. దీనిపై విచారణ జరిపించిన డిల్లీ ప్రభుత్వం ఆ హాస్పిటల్ పై చర్యలు తీసుకోడంతో మరో సారి ఈ
వ్యవహారంపై చర్చ మొదలైంది.

వివరాలిల్లోకి వెళితే ఢిల్లీ  షాలిమార్ బాగ్ లోని మాక్స్ ఆసుపత్రిలో నవంబర్ 30 న ఓ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే అందులో ఒక శిశువు
మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఆ నవజాత శిశువు శవాన్ని ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు, బందువులు ఆ శవాన్ని
ఖననం చేయడానికి తీసుకువెళ్లుండగా శిశువులో కదలికలు మొదలయ్యాయి. దీన్నిగ్రహించిన  వారు ఆ శిశువును మరో హాస్పిటల్ కు తీసుకువెళ్లగా శివువు బతికే
ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అతడికి వైద్యం అందించారు. అయినా వారం రోజుల తర్వాత ఆ శిశువు తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడు.

అయితే ఈ విషయం డిల్లీ సర్కార్ దృష్టికి వెళ్లడం, దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ కావడం జరిగింది.  వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా
వైద్యశాఖ అధికారులను ఆదేశించాడు. సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు విచారణ జరిపి ఈ ఘటనలో హాస్పిటల్ నిర్లక్ష్యం ఉందని తమ విచారణలో
తేలినట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.  దీంతో డిల్లీ ప్రభుత్వం వెంటనే మాక్స్ హాస్పిటల్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
షాలిమార్ బాగ్ లోని మాక్స్ హాస్పిటల్ లైసెన్సు రద్దు చేసినట్లు డిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ప్రకటించారు. ఇలాంటి నిర్లక్ష్య వైద్యాన్ని అందిచే
హాస్పిటళ్లన్నింటిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ నిషేదంతో ఇక కొత్త రోగులను చేర్చుకునేందుకు అనుమతించమని, అయితే ఇప్పటికే అందులో
ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వారు అక్కడే ఉండవచ్చని మంత్రి తెలిపారు.  ఆసుపత్రికి వ్యతిరేకంగా ఇప్పటికే ఐపిసి 308 సెక్షన్ కింద కేసు నమోదవగా, తాజాగా
నిషేదం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 

loader