భారత్-చైనా సరిహద్దులో పర్యటించిన నిర్మలా సీతారామన్ చైనా సైనికులతో ముచ్చటించిన రక్షణ మంత్రి నమస్కారం అర్థం వివరించిన నిర్మలా సీతారామన్
మీ అదంరికీ నమస్కారం అర్థం తెలుసా? ఈ ప్రశ్న.. నేను మిమ్మల్ని అడగడం లేదండి.., తెలుగింటి కోడలు..కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ అడుగుతున్నారు. అది కూడా మిమ్మల్ని కాదండోయ్.. చైనా సైనికులని. అలా అడగడమే కాదు.. దాని అర్థాన్ని ఆమె చైనా సైనికులకు వివరించారు కూడా.
అసలు విషయానికి వస్తే..రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం భారత్-చైనా సరిహద్దును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి చైనా సైనికులను కూడా కలిశారు. చైనా సైనికాధికారి తమ సహచరులకు ఆమెను పరిచయం చేసినప్పుడు.. ఆమె రెండు చేతులు జోడించి 'నమస్కారం' చేశారు. ఆ సమయంలో ఆమె 'మీకు నమస్కారం అర్థం తెలుసా?' అని చైనా సైనికులను ప్రశ్నించారు. అంతలో భారత సైనికులు నమస్కారం అర్థాన్ని చైనా సైనికులకు వివరించబోగా ఆమె వారిని వారించి తానే స్వయంగా చెబుతానని తెలిపారు.
అంతలో చైనా సైన్యానికి చెందిన ఓ అధికారి ఆమె ప్రశ్నకు సమాధానం తెలిపారు. నమస్కారం అంటే మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం( నైస్ టూ మీట్ యూ)’ అయ్యి ఉండచ్చని చెప్పారు. వెంటనే ఆమె నమస్కారాన్ని చైనా భాషలో ఏమని అంటారు అంటూ ఆ అధికారిని అడిగారు. అందుకు ఆయన నమస్కారానికి తమ భాషలో 'ని హావ్' అని అంటారని చెప్పారు.
ఆమె చైనా అధికారులతో జరిపిన సంభాషణ అంతా వీడియో తీశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా..ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
