కర్నూలు అసెంబ్లీ సీటు మీద వివాదం రాజుకుంటూ ఉంది. ఈ సీటు కోస రెండు పెద్ద కుటుంబాలు తలపడుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఎపుడూ రాజకీయాలే డామినేట్ చేస్తుంటాయి. అయితే, ఈ సారి వైసిపి నేత కుటుంటరాజకీయాలనుంచి పార్టీ ని దూరంగా జరిపి, రాజకీయాలతో అంతగా సంబంధం లేని ముస్లిం అభ్యర్థి పేరు ప్రకటించి సంచలనం సృష్టించారు. ఇపుడున్న పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమయిన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని కర్నూలు ముస్లిం సమాజం  స్వాగతిస్తూ ఉంది. అయితే, అటువైపు తెలుగుదేశం టిజి కుటుంబం, ఎస్వీ కుటుంబం కర్నూలు అసెంబ్లీ సీటు కోసం తన్నుకోవడం మొదలు పెట్టాయి. 2019లో ఈ టికెట్టు కోసం రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఇపుడు బజారు కెక్కుతూ ఉంది. ముందుకు ముందు ఇంకా నాస్టీ గా తయారు కావచ్చు. కొడుకు భరత్ కోసం టిజి వెంకటేశ్ కర్నూలు సీటు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు బాగా డబ్బున్నవాళ్లు.వూరో రాజకీయంగా పాలెగాళ్లే.

ఓట్లు ఎలా సంపాదించాలో తెలిసినోళ్లే. అయితే, సిటింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సెంటిమెంట్ ప్రయోగించి టిజి ఎత్తులను చిత్తు చేయాలనుకుంటున్నారు. ‘2014లో కర్నూలు ప్రజలు నన్ను గెలిపించారు. ఆ రుణం తీర్చుకునేందుకు నాకు 2019లో కూడా  కర్నూలు సీటు కావాల,’ అంటున్నాడు సిటింగ్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. ఆ రుణం తీరేది కాదు. కర్నూలు సీటు లాగేసుకుంటే నేనెక్కడి వెళ్లాలని ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్న. ఆయనకు మరొక నియోజకవర్గం లేదు. ఎందుకంటే, సొంతవూరు ఆళ్లగడ్డ వెళ్లలేడు, అక్కడ మేనకోడలు ఆఖిల ప్రియ వుంది. పక్కనున్న నంద్యాల సీటు అడగలేడు, అక్కడ బావ భూమా నాగిరెడ్డి అన్నకొడుకు మొన్న ఉప ఎన్నికలలో గెలిచాడు. కాబట్టి 2019లో ఆయనను కాదని ఆ సీటును చంద్రబాబు నాయుడు ఎస్వీకి ఇస్తాడా?

తన తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి ఒకపుడు ప్రాతినిధ్యం వహించిన పాత నియోజకవర్గం  పత్తి కొండ వెళ్లలేడు ,అక్కడ డిప్యూటి సిఎం కెయి కృష్ణమూర్తి ఉన్నాడు.కాబట్టి తనకు కర్నూలే కావాలంటున్నాడు.

దీనికి టిజి వెంకటేశ్ సమాధానం...

‘2019లో  సీట్ల సంఖ్య పెరిగి ఎక్కడో ఒక చోట సీటొస్తుంది, కర్నూలు ఖాళీ చేయాల్సిందే.’ఒకే కుటుంబానికి మూడుసీట్లేమిటని టిజి రెచ్చగొట్టే విధంగా  ప్రశ్నిస్తున్నారు. మనలో మాట ఒకే కుటుంబానికి రెండు సీట్లు పర్వాలేదా... ఎందుకంటే, తాను రాజ్యసభ సభ్యుడు, రెండు సీటులగా కొడుక్కి కర్నూలు అసెంబ్లీ సీటు అడుగుతున్నారు. ఈ గొడవ రెండు రోజుల కిందటజరిగిన ‘జన్మభూమి’ కార్యక్రమంలో స్టేజీ ఎక్కింది. అక్కడ టిజి, ఎస్వీలమధ్య మాటల యుద్ధం నడిచింది.  

ఇపుడు జిల్లాలో హాట్ టాపిక్ ఇదే. చంద్రబాబు నాయుడు వారి నోరు మూయిస్తారా లేక  కొద్ది రోజులు ఈ రచ్చను అనుమతించి ఇద్దరిని కాదని మూడో వ్యక్తిని తెరమీదకు తెస్తారా? ఏమయినా సరే, పార్టీ ఫిరాయించి ఎస్వీమోహన్ రెడ్డి కష్టాల్లో పడ్డాడు. 2014 ఎన్నికల్లో గెలిచి, 2016 మేలో టిడిపికి ఫిరాయించిన  ఘనుడు ఎస్వీ మోహన్ రెడ్డి. ఇపుడాయనకు 2019లో టికెట్ వస్తుందో రాదోననే మానసిక బెంగపట్టుకుంది.