అండర్ వాల్డ్ క్షేమంగా ఉన్నారన్న చోటా షకీల్

దావూద్ కు గుండెపోటు... పాకిస్తాన్ లోని ఓ ఆస్పత్రిలో చేరిక... విషమంగా ఆయన పరిస్థితి... పొద్దుటి నుంచే టీవీ చానెళ్లలో ఇదే మోత...

అయితే అండర్ వాల్డ్ డాన్ బాగానే ఉన్నాడట. ఇంతకీ ఈ విషయం చెప్పింది ఎవరో కాదు. ఆయన రైట్ హ్యాండ్ చోటా షకీల్.

భాయ్ చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చోటా షకీల్ బల్లగుద్ది చెబుతున్నాడు. డాన్ పై కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

దావూద్ పై వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆయనే పాకిస్తాన్ లోని కరాచీ నుంచి కొన్ని మీడియా చానెళ్లకు ఫోన్ చేసి ఈ వివరాలు వెల్లడించారు.