వైరల్ గా మారిన భారత ఆర్మీ అధికారి ఆఖరి మాటలు(వీడియో)

వైరల్ గా మారిన భారత ఆర్మీ అధికారి ఆఖరి మాటలు(వీడియో)

దేశం కోసం  ప్రాణాలు అర్పించిన ఓ భారత ఆర్మీ  అధికారి చివరగా చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. గత శనివారం కేరీలో పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణకు పాల్పడగా.. నలుగురు భారత్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో సీఆర్పీఎఫ్ మేజర్ ప్రఫుల్లా అంబాదాస్ మొహర్కర్ కూడా ఉన్నారు ఆయన తన ప్రాణాలు పోతున్న సమయంలో కూడా తోటి జవాన్ల రక్షణ కోసం పాకులాడారు. తోటి జవాన్లలో ధైర్యం నింపారు.

 

“గాయపడ్డ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించండి.. హెడ్ క్వార్టర్స్ కు కాల్పుల ఉల్లంఘన విషయం చేరవేయండి.. ఆయుధాల కొరత లేదు… ఎదురు కాల్పులు కొనసాగించండి… సిక్స్ డెల్టా టీమ్ కు ఈ విషయం చెప్పండి.. వాళ్లను సిద్ధంగా ఉండమని చెప్పండి.నిప్పు రాజేసి… పొగ వచ్చేట్టు చేయండి… హెలికాఫ్టర్ లో వచ్చే వాళ్లకు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది… ముందుకు వెళ్లకండి… జాగ్రత్త” అంటూ తోటి జవాన్లకు సూచనలు చేశాడు. ఆయన ఆఖరి మాటలను వీడియో తీయగా.. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో మీరు చూడండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos