ఒక్క పోస్టుకు 2.7 కోట్ల సంపాదన. టాప్ 3 లో పోర్చుగల్ క్రీడాకారుడు.
క్రిస్టియన్ రొనాల్డో పుట్‌బాల్ లో అత్యధిక ఆదరణ ఉన్న క్రీడాకారుడు. పోర్చుగల్ ప్రధాన ఆటగాడిగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అంతే కాదు రియల్ మాడ్రిడ్ టీంలో అత్యధిక పారీతోషకం అందుకుంటున్న ఆటగాడు కూడా ఇతడే. అయితే ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ రొనాల్డోకి బ్రాండ్ విలువ కూడా అధికంగా ఉంటుంది.

రొనాల్డోకి ఉన్న పాపులారిటి మాములుది కాదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఇంస్టాగ్రామ్ ఖాత తెరిచిన కేవలం 10 రోజుల్లోనే 6 కోట్ల మంది ఫాలోయర్లను దక్కించుకున్న మొట్టమొదటి వ్యక్తి. రొనాల్డోకి ప్రస్తుతం 107 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. అంటే 10 కోట్ల 7 లక్షల మంది. ఇంస్టాగ్రామ్ రొనాల్డోతో ఒక ఒప్పదం కుదుర్చుకుంది. ప్రస్తుత ఫాలోయర్ల ప్రకారం ఆయన ఒక్క పోస్టుకు 2.6 కోట్ల రూపాయలు అందుతున్నాయని తెలిపారు

ఇదే విషయాన్ని ఇంస్టాగ్రామ్ సిఓఓ హుపర్ తెలిపారు. ఇప్పటి వరకు రొనాల్డో కన్న ఇంస్టాగ్రామ్ నుండి అత్యధికంగా సంపాధిస్తున్న వారు సింగర్ సెలీనా గోమేజ్ 3.2 కోట్లు ఒక్క పోస్టుకు. కిమ్ కర్దానియా ఒక్క పోస్టుకి 3.7 కోట్లు సంపాధిస్తున్నారని తెలిపారు.
