ఈ క్రికెట్ వీరుడెవరో తెలుసా?

First Published 30, Dec 2017, 3:41 PM IST
CPM MP Rajesh  seen  playing street smart cricket  in palakkad town
Highlights

ఇలా ఎంపిలు మరీ ఇంత సింపుల్ గా ఉండటం బాగుందా?

ఈ ఫోటోలో అడ్డపంచె కట్టుకుని క్రికెట్ ఆడుతున్న మనిషెవరై ఉంటారు. ఊర్లో పనీ పాట లేకుండా తిరిగే వాడే ఇలా వీధి పిల్లల్తో  క్రికెట్ ఆడగలడు. మరి ఈ పెద్ద మనిషెవరై ఉంటారు. గుర్తుపట్టండి. సినిమా యాక్టరా.. ఎంపియా... లేక ఎవరబ్బా?సినిమా యాక్టరయితే కాదు. మరెెవరు? జాగ్రత్తగా చూడండి.

 పార్లమెంటు సభ్యుడేనా... నమ్మడం చాలా కష్టం. ఎందుకంటే, మన ఆంధ్ర, తెలంగాణలో ఎంపిలు ఎలా ఉంటారో మనకు తెలుసు. గనమన్ లేకుండా ఉండరు. ఇలా అడ్డపంచెతో ఇంట్లో కూడా కనిపించరు. ఇంటిదగ్గిర జైకొట్టే అనుచరులుంటారు. అరడజను తక్కువ కాకుండా కార్లుంటాయి. పార్టీ నాయకుడి బ్యానర్లు, జండాలుంటాయి.కాని ఇక్కడలాంటివేవీ లేవు.  ఈ లెక్కన ఈ క్రికెట్టాడుతున్న పెద్ద మనిషి ఎంపి అయివుండే అవకాశమే లేదు. రాంగ్.

ఆయన ఎంపియే. సాదా సీదా లో క్ సభ సభ్యుడు. తెలుగు ఎంపిలాంటి వోడు కాదు. కేరళ పాలక్కాడ్ నియోజకవర్గం లోక్ సభ సభ్యుడు. పేరు ఎం. బి రాజేష్. పార్టీ సిపిఎం. వయసు 46 సంవత్సరాలు.

స్టూడెంట్ పాలిటిక్స్ (ఎస్ ఎఫ్ ఐ) నుంచి రాజకీయాల్లోకి వచ్చి 2014 లోక్ సభకు ఎన్నికయ్యారు. ఇలాగే ఉంటాడు. ఎలాంటి ఆర్భాటాలుండవు. ఢిల్లీలో ఇలాగే ఉంటాడు. పాలక్కాడ్ లో ఇలాగే ఉంటాడు. మీ పక్కింట్లో అద్దెకున్న ఎమ్ సిఎ (మిడిల్ క్లాస్ ఆయన) లాగా ఉంటాడు. అదే తేడా. అది కేరళ, ఇది ఆంధ్ర, కాకుంటే తెలంగాణ.

 

loader