ఆంధ్రప్రదేశ్ వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ అబ్బల జాగీరనుకుంటున్నారని సిపిఐ మండిపడింది. తెలుగుదేశం, వైసిపిలు ప్రజల మాట పక్కన పెట్టి, రాష్ట్రాన్ని ఎంతకాలం తాము పరిపాలించాలో కలలు కంటున్నాయని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ వైసిపి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ అబ్బల జాగీరనుకుంటున్నారని సిపిఐ మండిపడింది.
సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం, వైసిపిలు ప్రజల మాట పక్కన పెట్టి, రాష్ట్రాన్ని ఎంతకాలం తాము పరిపాలించాలో కలలు కంటున్నాయని అన్నారు.
‘‘13 కేసుల్లో A1ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలు నేనే సీఎం అంటున్నాడు,అటు టీడీపీ ప్రభుత్వం 2050 వరకు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని అంటున్నారు, ఇ రాష్ట్రం ఏమైనా వాళ్ళ అబ్బాజాగీరా...’’ అని ఆయన అన్నారు.
ప్రజలు ఈ వారసత్వ జాగీరు రాజకీయాలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.
17,18 తేదీల్లో పార్టీరాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహిస్తున్నామని రామకృష్ణ ప్రకటించారు.
ప్రధానంగా రైతు అంశాలపై, వారసత్వ రాజకీయాలపై ఈ రెండు అంశాలపై చర్చలు జరగుతాయని చెబుతూ...
70ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మూడేళ్ళ మోడీ పాలనలో రైతులకు ఎటువంటి మేలు జరగలేదని రామకృష్ణ అన్నారు.
జులై 24,25,26 తేదీలలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ అంశాలమీద పోరాటకార్యక్రమాలు రూపొందించనుందని ఆయన చెప్పారు.
