సిపిఐ సీనియర్ నాయకుడు నారాయణ తాను నమ్మిందాన్ని చేసేందుకు, అనుకున్నది చెప్పేందుకు జంకడు. అందుకే నారాయణ పార్టీ, సిద్దాంతాలు నచ్చని వాళ్లు కూడా ఆయన్ని అభిమానిస్తారు. ఆయన ఒకవిధంగా అజాత శత్రువు. ఆ మధ్య చికెన్ ఇష్టపడి తిని చికెన్ నారాయణ అనిపించుకున్నారు. ఇపుడు ఆయన సరదాగా కల్లు తాగారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల కోసం ఆయన విజయవాడ వచ్చారు. ఈ ఉదయం అమరావతి పరిసరాలలో గడిపారు. అక్కడ పోద్దునే సైక్లింగ్ చేశారు. తర్వాత దారిలో సరదాగా గ్లాసెడు తాటికల్లు సేవించారు. ఆ తర్వాత  సైకిల్ తొక్కుకుంటూ వెలగపూడి సెక్రెటేరియట్ కు వచ్చారు.తాత్కాలిక సెక్రేటేరియట్  చూద్దామని ప్రాంగణంలోకి వచ్చారు. ఆ సమయంలో ఎవరూ ఉండరని ఎస్‌పిఎఫ్ సిబ్బంది  నారాయణకు చెప్పారు. దీనితో ఆయన  లాన్లో కాసేపు గడిపి బయటకు వచ్చారు.