కొత్త చట్టం రూపొందించే పనిలో గుజరాత్ ప్రభుత్వం
దేశంలో రాజకీయ అంశంగా గోవు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గోవధను, గో మాంసంను నిషేధిస్తూ చట్టాలు తీసుకొచ్చాయి.
తాజాగా గుజరాత్ ప్రభుత్వం గోవులను వధించినా, మాంసాన్ని రవాణా చేసిన జీవిత ఖైదు విధించేలా ఓ చట్టానికి రూపకల్పన చేస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీనే తెలిపారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై చట్టం తీసుకొస్తామని ప్రకటించారు. గో మాంసాన్ని తరలించే వాహనాలు సీజ్ చేసేలా చట్టం తీసుకువస్తామన్నారు.
గతంలో గోవును వధించినా, గో మాంసాన్ని తరలించినా రూ.50 వేల జరిమానాతోపాటు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించేలా చట్టం చేశామని గుర్తు చేశారు.
2011 లో తాము తీసుకువచ్చిన గో సంరక్షణ చట్టానికి మార్పులు తీసుకువచ్చి ఈ కొత్త చట్టం అమలు చేస్తామని తెలిపారు.
