పశ్చిమబెంగాల్ కు చెందిన అబ్దుల్ మన్నన్ పెరట్లో దోసకాయలు కోస్తున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ నాలుగు అంతస్తుల ఇంటి పై నుంచి ఓ గోవు వచ్చి ఆయన మీద పడింది.

ఇటీవల దేశంలో చర్చంతా గోవుల చుట్టూ తిరుగుతోంది. మనుషులకు ఆధార్ కార్డు ఇచ్చినట్లు గోవులకు గోధార్ కార్డు ఇవ్వాలని కేంద్రం బాగా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక గోవుల సంరక్షణ పేరుతో కొన్ని హిందూ సంస్థలు చేస్తున్న అతి సర్వత్రా చర్చలకు దారితీస్తోంది.ఇలా దేశమంతా రోజూ ఏదో ఒక గోవు వార్త దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. తాజాగా పశ్చిమ బెంగాల్ లో ఓ గోవు మృతి చెందడం పెద్ద వార్తగా నిలిచిపోయింది.

పశ్చిమబెంగాల్ కు చెందిన అబ్దుల్ మన్నన్ పెరట్లో దోసకాయలు కోస్తున్నాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ నాలుగు అంతస్తుల ఇంటి పై నుంచి ఓ గోవు వచ్చి ఆయన మీద పడింది.

ఇంకేముంది... మన్నన్ రక్తపు మడుగులో పడిపోయాడు. అక్కడి వారు వెంటనే గమనించి ఆయనను ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది. అయితే అలా నాలుగు అంతస్తులపై నుంచి పడిన గోవు మాత్రం చనిపోయింది.

ఇంతకీ ఆ గోవు పై కెందుకు వెళ్లినట్లు... ఇంతకీ అది కిందకు ఎందుకు దూకినట్లు అది మాత్రం ఎవరికి తెలియడం లేదు.