వైరల్ అయి పోయిన ముఖేష్ అంబానీ కొడుకు  వెడ్డింగ్ కార్డు

First Published 9, Dec 2017, 1:11 PM IST
costliest wedding card  price mukesh ambanis son Akash wedding card goes viral
Highlights

వెడ్డింగ్ కార్డును అందుకున్న ప్రతివారు జీవితాంతం అపురూపంగా దాచుకునేలా రూపొందించారట

ముఖేష్ అంబానీ గురించి ఏవి చెప్పుకున్నా పెద్ద పెద్ద విషయాలే చెప్పుకోవాలి.

ఫోర్బ్స్ ధనవంతుల జాబితా, ప్రపంచంలో అతి ఖరీదైన, పెద్దదైన ఇల్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో టెలికాం.... ఇలా అన్ని రికార్డులే. అయితే, ఈ సారి ఒక చిన్న విషయం, అందునా జానెడు లేదా మూరెడు మించని కార్డు ముక్క అంబానీలను ఆకాశనికెత్తనుంది. అదేమిటో తెలుసా, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి వ్యవహారానికి సంబంధించింది.

ఈ పెళ్లి కార్డు ఇపుడు సోషల్ మీడియా హాటాట్ టాపిక్ అయింది. ఎందుకంటే, ఈ కార్డు ధర.

ఎంతో వూహించగలరా.

ఈ ధరతో  దేశంలో ఖరీదయిన మొబైల్ ఫోన్ కొనవచ్చు.

ఈ క్లూ తో కార్డు కవుతున్ ధర ను చెప్పగలరా?

కష్టమే... చెప్పలేరు.

సస్పెన్స్ విప్పేముందుకు ఆకాశ్ అంబానీ గురించి రెండు ముక్కలు

ప్రపంచంలో ధనవంతుడి వారుసుడు అకాశ్ అంబానీ. అంతకంటే ముఖ్యంగ  జియో ఫోన్ స్ట్రాటజీ ఆకాశ్ అంబానీదే నట.

జియో ఫోన్ భారతీయ మొబైల్ టెలిఫోన్ రంగాన్ని అతలాకుతలం చేసి, ఇతర సర్వీసు ప్రొవైడర్లను బతుకుదెరువు కోసం పరుగులు పెట్టించింది.

దీనితో ఆకాశ్ గ్లామన్ ఆకాశానికెగిసింది.

26సంవత్సరాల ఆకాశ్ పెళ్లి గురించి వివరాలేవీ పొక్కడం లేదు. అంతా గోప్యంగా ఉంది. అమ్మాయెవరు? పెళ్లెపుడు? ఎవరికి తెలియవు.

అయితే, ఆయన పెళ్లిపత్రిక మాత్రం సోషల్ మీడియాలో దూరి హల్ చల్ చేస్తున్నది.

బంగారు పూత, సుందరమయిన నగీషీలున్న ఆయన వెడ్డింగ్  కార్డు ఇదే నంటూ ఒక  పెళ్లి పత్రిక వైరల్ అయింది. ఇదెందుకు వైరల్ అయిందంటే, దాని ధర అలాంటిది.

సోషల్ మీడియ సమాచారం ప్రకారం, వెడ్డింగ్ కార్డు ధర అక్షరాల లక్షన్నర రుపాయలు (రు.1.5 లక్ష)

అదీ కథ.

ఈ వెడ్డింగ్ కార్డును అందుకున్న ప్రతివారు జీవితాంతం అపురూపంగా దాచుకునేలా రూపొందించారట.
ఈ పెళ్లి డిసెంబర్ లోనే జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.

loader