దేశాధ్యక్షుని కూతురు చేయాల్సిన పనేనా ఇది

First Published 29, Mar 2018, 2:05 PM IST
Controversy after President’s daughter posts photo of breastfeeding in her underwear
Highlights
అండర్ వేర్ ధరించి.. బిడ్డకు పాలిచ్చిందేగాక.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

దేశాధ్యక్షుని కూతరు హోదాలో ఉండి.. చేయకూడని పనిచేసింది. అండర్ వేర్ ధరించి.. బహిరంగంగా బిడ్డకు పాలు ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో.. ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. ఈ పనిచేసింది ఏ దేశ అధ్యక్షుడి కూతురు అనే కదా మీ అనుమానం.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

కిర్గిజ్ స్తాన్ దేశాధ్యక్షుడు అల్మాజ్ బేక్.. కుమార్తె అలియా.. ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. కాగా.. ఆ ఫోటోలు తీవ్ర వివాదానికి దారి తీసాయి. ఈ ఫోటోలో అలియా.. అండర్ వేర్ ధరించి ఉంది. అంతేకాకుండా తన బిడ్డకు పాలు ఇస్తూ కనపడుతోంది. కాగా.. ‘‘ నా బిడ్డకు ఆకలి వేస్తే నేను ఎక్కడైనా.. ఎప్పుడైనా పాలు ఇవ్వగలను.’’ అనే క్యాప్షన్ ని కూడా జత చేసింది.

అయితే.. ఇలా బిడ్డకు పాలు ఇస్తారా..?  ఒక వేళ ఇచ్చినా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తారా అంటూ నెటిజన్లు మండిపడ్డారు. కాగా.. దీనిపై అలియా స్పదించింది. ఆ ఫోటోలను సెక్సువల్ గా ఎందుకు చూస్తారంటూ మండిపడింది. ఓ తల్లి.. తన బిడ్డ ఆకలి తీరుస్తుందన్న కోణంలో ఎందుకు ఆలోచించరు అని ప్రశ్నించింది. ఈ ఫోటోలను తాను వల్గర్ ఉన్నానా.. లేదా అన్న కోణంలోనే నెటిజన్లు చూస్తున్నారని. కానీ.. తన బిడ్డ అవసరాన్ని తీరుస్తున్నట్లు ఎందుకు చూడటం లేదని ప్రశ్నించింది.

loader