కౌన్సిల్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వాకౌట్

First Published 1, Nov 2017, 12:20 PM IST
Congress stages walk out from Telangana legislative council
Highlights

తెలంగాణ యువకులకు తెలంగాణ ఇచ్చిందేమిటి? ఉద్యోగాలెక్కడ?

 తెలంగాణ శాసన మండలి నుంచి బుధవారం నాడు  కాంగ్రెస్ వాకౌట్ చేసింది. రాష్ట్రంలో  నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం మీద  ప్రభుత్వం సమాధానం దాటవేస్తుందంటూ కాంగ్రెస్ సభ్యులు సభనుంచి  వాకౌట్ చేశారు. ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వడం లేదని రాష్ట్రం వస్తే ఉపాధి పెరుతుతుందని,  తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన  యువకులు నిరశాకు లోనయ్యారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. వారి బతుకులను ప్రభుతవం రోడ్డున పడేసిందని మండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని   చెప్పి 20వేలకు మంచి  ఉద్యోగాలు ఇవ్వలేదని మిగిలిన వాటి సంగతేంటని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన వాటిలో కానిస్టేబుల్ ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయని షబ్బీర్ అన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంగ్రెస్ వాకౌట్ చేస్తున్నామని షబ్బీర్ ప్రకటించారు.

loader