కన్నడ క్రైసిస్.. మరో ఆడియోటేపు కలకలం

First Published 19, May 2018, 12:59 PM IST
Congress releases audio, claims bribery by Yeddyurappa’s son
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి గాలం వేస్తున్న యడ్యురప్ప కుమారుడు

కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యురప్ప కుమారుడు రంగంలోకి దిగారు. పదవులను ఆశజూపి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 
ప్పటిదాకా భాజపా నేతలే ఇలాంటి ప్రయత్నాలు చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు కూడా ప్రలోభాలకు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సాక్ష్యం ఇదిగో అంటూ ఓ ఆడియోను విడుదల చేసింది.

యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తమ ఎమ్మెల్యేలకు రూ.5కోట్లు, మంత్రి‌ పదవి ఆఫర్‌ చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. విజయేంద్ర మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి విడుదల చేసింది. మరికొద్ది గంటల్లో యడ్యూరప్ప బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో మరింత ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌ నిన్న కూడా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దల్‌ను భాజపా తరఫున మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదించినట్లుగా ఉంది. ఆడియో రికార్డు సారాంశం ప్రకారం.. రాజుగౌడ అనే వ్యక్తి మధ్యవర్తిత్వంలో బసవనగౌడతో గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ‘పార్టీ పెద్దలే నేరుగా డీల్‌ గురించి చర్చిస్తారు. నీ జీవితానికి సరిపడా సంపాదించుకునే అవకాశమిది. మంచి సమయంలో భాజపా అధికారంలోకి వచ్చింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దు’ అంటూ గాలి సూచించడం గమనార్హం.


 

loader