జేడీఎస్ తో మేము పొత్తు పెట్టుకుంటాం.. కాంగ్రెస్

First Published 15, May 2018, 10:19 AM IST
Congress open to alliance with JD(S) in Karnataka: Ashok Gehlot
Highlights

జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో మంతనాలు

కర్ణాటకలో అధికారం దక్కించుకునేందుకు తాము ఏమైనా చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా.. జేడీఎస్ మద్దతు తీసుకొని కర్ణాటకలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతలు జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడతో మంతనాలు జరుపుతుండగా తాజాగా ఎన్నికల అనంతర పొత్తులపై కాంగ్రెస్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌ స్పష్టత ఇచ్చారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గెహ్లాట్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. జేడీఎస్‌తో పొత్తు సహా ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అవకాశాలనూ పరిశీలిస్తామని చెప్పారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికీ మారుతూ ఉత్కంఠకు లోనుచేస్తున్నాయి.

loader