తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణహత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాస్ తలను బండరాయితో మోదీ హతమార్చారు. అనంతరం పక్కనే ఉన్న మురికి కాలువలో పడేశారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. శ్రీనివాస్ కుటుంబ సభ్యలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్రీనివాస్ భార్య బొడ్డుపల్లి లక్ష్మి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌‌‌గా పనిచేస్తున్నారు.

శ్రీనివాస్ హత్య గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి .. హుటాహుటున నల్గొండ చేరుకున్నారు. హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీనివాస్ హత్యను నిరసిస్తూ.. నల్గొండ బంద్ కి పిలుపునిచ్చారు.