అజ్ఞాతం వీడిన ఆనంద్ సింగ్: కాంగ్రెసుకు శుభవార్త

Congress MLA Anand Singh surfaces in Hyderabad
Highlights

హోసపేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అజ్ఞాతం వీడారు. ఆయనను బిజెపి హైజాక్ చేసిందనే ప్రచారం జరిగింది.

బెంగళూరు: హోసపేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ అజ్ఞాతం వీడారు. ఆయనను బిజెపి హైజాక్ చేసిందనే ప్రచారం జరిగింది. ఆయనను కిడ్నాప్ చేసి, గుర్తు తెలియని చోట బిజెపి నిర్బంధించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఆయన హైదరాబాదులోని ఫైవ్ స్టార్ హోటల్లో దర్శనమిచ్చారు. ఆయన విమానంలో బయలుదేరి బెంగళూరు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యేల ప్రతాప్ గౌడ పాటిల్ కూడా హైదరాబాదు నుంచి విమానంలో బెంగళూరుకు బయలుదేరినట్లు తెలుస్తోంది.

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడైన ఆనంద సింగ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెసు వైపు వచ్చి పోటీ చేసి గెలిచారు. గాలి జనార్దన్ రెడ్డి వల నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో కాంగ్రెసు ఫలితం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. 

తాను ఏ పార్టీ తరఫున గెలిచానో ఆ పార్టీకే ఓటు వేస్తానని ఆనంద సింగ్ స్పష్టం చేశారు. ఆనంద సింగ్ తో పాటు ప్రతాప్ గౌడ పాటిల్ కూడా కాంగ్రెసు, జెడిఎస్ కూటమికే ఓటు వేసే అవకాశాలున్నాయి. 

ఆనంద సింగ్ తమ వద్ద లేనప్పటికీ తమ నాయకులతో టచ్ లో ఉన్నారని మాజీ మంత్రి రామలింగారెడ్డి చెప్పిన కొద్దిసేపటికే ఆనంద సింగ్ కనిపించారు. దానికితోడు కాంగ్రెసు వైపే ఉంటానని స్పష్టం చేశారు. 

loader