మరొక తెలంగాణ ఉద్యమం అవసరం

మరొక తెలంగాణ ఉద్యమం అవసరం

 ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం తరహాలో మరో ఉద్యమం అనివార్య మవుతున్నదని  టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క మల్లు అభిప్రాయపడ్డారు. టీఆరెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశయాలను , ఆకాంక్ష లను నీరుకార్చడమే దీనికి కారణమని ఆయన అన్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో  మాట్లాడుతూ  ఆనాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది నిధులు , నీరు , నియామకాల కోసమని ఆయన గుర్తు చేశారు. ఇందులో ఏ ఒక్కటి అమలు కాలేదన్న చెబుతూ  మిగులు బడ్జెట్ తో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ తన అనాలోచిత విధాలతో అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు.

నీళ్ల విషయానికి వస్తే చుక్క నీరు పారించలేకపోయారని విమర్శించారు.  ఇక నియామకాల విషయానికి వచ్చేసరికి నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపలేకపోయిందని అందుకే  విద్యార్థుల బలిదానాలు పూనుకుంటున్నారని, ఇది చాలా బాధాకరమని భట్టి అన్నారు. 

 ఓయూ విద్యార్థి మురళి వంటి విద్యార్థుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు.మురళి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 
ఈ పరిణామాల నేపధ్యంలో కొలువుల కోట్లాటలు అనివార్య మైందని అంటూ  మరొక తెలంగాణ ఉద్య మం అవసరమొచ్చిందని అన్నారు.
రాష్ట్రంలో విద్యార్థుల , నిరుద్యోగుల ఆకాంక్ష నెరవేరాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో సాధ్యమన్నారు.

అక్రమ అరెస్టులకు ఖండన

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అక్రమ అరెస్ట్ లను భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. అద్దంకి దయాకర్ , ప్రతాప్ రెడ్డి , విద్యార్థి నాయకులు  మానవత రాయ్ , దరువు ఎల్లన్న , దుర్గం భాస్కర్ లను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం అణచివేత ధోరణిని విడనాడాలని భట్టి విక్రమార్క అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos