పక్కా ప్లాన్ తో బెంగళూరుకు: తాజ్ కృష్ణా వెనక గేట్ నుంచి ఎమ్మెల్యేలు

First Published 18, May 2018, 10:14 PM IST
Congress, JDS left for Bengalauru from Hyderabad
Highlights

కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు హైదరాబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరారు. 

హైదరాబాద్: కాంగ్రెసు, జెడిఎస్ శాసనసభ్యులు హైదరాబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరారు. కాన్వాయ్ గా కాంగ్రెసు ఎమ్మెల్యేలు బెంగళూరుకు బయలుదేరారు. తాజ్ కృష్ణా వెనక గేటు నుంచి కాంగ్రెసు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లారు. 

కాంగ్రెసు ఎమ్మెల్యేలు 200 వాహనాల కాన్వాయ్ గా బెంగళూరుకు బయలుదేరారు. ముందస్తుగా ఎమ్మెల్యేల కోసం 160 విమానం టికెట్లు కూడా బుక్ చేశారు. ఆంధ్ర సరిహద్దుల వరకు తెలంగాణ కాంగ్రెసు నాయకులు కాన్వాయ్ లో వెళ్లనున్నారు. ఆంధ్ర సరిహద్దుల వరకు ఎపిపిసిసి నాయకులు వెళ్లనున్నారు. 

అంతకు ముందు తాజ్ కృష్ణాలో కాంగ్రెసు శాసనసభా పక్ష సమావేశం జరిగింది. తమ నాయకుడిగా ఎమ్మెల్యేలు సిద్దరామయ్యను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జెడిఎస్ నేత కుమారస్వామి కూడా పాల్గొన్నారు.

ఆ తర్వాత కుమారస్వామి తమ పార్టీ ఎమ్మెల్యేలు బస చేసిన నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. వారితో ఆయన రేపటి వ్యూహాన్ని ఖరారు చేశారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఆరెంజ్ వాహనంలో ఎమ్మెల్యేలు బెంగళూరుకు బయలుదేరారు. 

loader