చిల్లర నోట్ల కోసం క్యూలో నిలబడి చనిపోయిన వారికుటుంబాలకు మోదీ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి -ఆంధ్ర కాంగ్రెస్
బ్యాంకుల దగ్గిర ఏటీఎంల దగ్గిర చిల్లర నోట్ల కోసం క్యూలలో నిలబడి అనేక మంది చనిపోవడానికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు విజయవాడలో ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ మోదీ చర్యని అమాయక ప్రజల పొదుపు సొమ్ముపై మోదీ జరిపిన సర్జికల్ దాడి అని విమర్శించారు.
ప్రధాని సర్జికల్ దాడుల సరదా వల్ల అమాయకప్రజలు విలవిల్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రధాని మోదీ తీసిన నోట్ల దెబ్బతోప్రజలెలాంటి కష్టాలెదుర్కొంటున్నారో తెలుసుకునేందుకు రఘువీరా రెడ్డి ఈరోజు విజయవాడలో బ్యాంకులకు వెళ్లారు.
పెద్ద నోట్లరద్దు ముందుచూపు లేకుండా చేశారని, అయిన వారందరికి ముందే సమాచారం చేరవేసి, సామాన్యులను రోడ్డున పడేశారనిచెబుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఆందోళనలు చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఏపీసీసీ చీఫ్ విజయవాడలో బ్యాంకులకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పెద్ద నోట్ల రద్దు, కరెన్సీ నోట్ల కొరతతో వ్యాపారులు ఇబ్బందుల గురించి క్యూలలో ఉన్నవారిని అడిగి తెలుసుకున్నారు.
పాత నోట్లను రద్దు చేయడం కొత్తదేమీదకాదని, 2005 కంటే ముందటి కరెన్సీ నోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో రద్దు చేసినప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదదని, దీనికి అప్పటి ప్రభుత్వంఅన్ని పడకుండా తీసుకోవడమే నని ఆయన ప్రజలకు వివరించారు.
’మోదీ ప్రభుత్ ప్రస్తుతం అలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నోట్ల కష్టాలు తొలగిపోవాలంటే 50 రోజులు ఆగాలని ప్రధాని మోదీ చెబుతుంటే… ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మూడు నెలలు ఆగాలంటున్నారు. ఏవరు కరెక్టు. నోట్ల సర్ధుబాటు చేయలేని మోదీ ప్రధాని పదవినుంచి వైదొలగాలి,‘ అని ఆయన డిమాండ్ చేశారు.
పొదుపు ఖాతాలనుండి డబ్బు తీసుకోవడంపై ఆంక్షలు విధించడం దారుణం మని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం ఒక వైపు బడా బాబుల అప్పులు మాఫీ చేస్తూ మరోవైపు ప్రజల సొమ్మును లూటీ చేసే కార్యక్రమం చేపట్టారు. బ్యాంకులంటే ప్రజలలో నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడిందని ఎపిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ అన్నారు. నల్లధనం అరికట్టడం అంటే పేదల సొమ్ము పెద్దోళ్లకు దోచి పెట్టడమా అని చెబుతూ దేశాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకుపోయిన ఘనత మోదీకే దక్కంది.
