తెలంగాణాలో మహిళా కలెక్టర్లు కొత్త జిల్లాలు రావడంతో తొందరగా కలెక్టర్లయ్యే అవకాశం మొచ్చింది. దీనితో వీళ్ల పని తీరే భిన్నంగా ఉంటున్నది. రాజీ ధోరణి అనేది లేకుండా పనిచేస్తున్నారు. అధికారులను పరగుపెట్టిస్తున్నారు. తెలంగాణా మహిళా కలెక్టర్లు ఇపుడు రోజూ ఒక సంచలన వార్తే.
తెలంగాణాలో మహిళా కలెక్టర్లు, మహిళ ఎస్ పిలు సంచలనం సృష్టిస్తున్నారు. కొత్త జిల్లాలు రావడంతో తొొందరగా కలెక్టర్లు, ఎ స్ పిలవుతున్నారు. దీనితో అధికారులను పరుగుపెట్టించి పనులు చేయిస్తున్నారు.రాజీ ధోరణి అనేది లేకుండా ఉంటున్నారు. తెలంగాణా మహిళా కలెక్టర్లు ఇపుడు అందరి దృష్టి ఆకట్టుకుంటున్నారు.
తాజాగా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వాతా మహంతికి కోపమొచ్చింది. అధికారుల అలసత్వంపై పై మండిపండారు. క్రమ శిక్షణ చర్య తీసుకున్నారు. రాష్ట్రపభుత్వం చేపడుతున్న హరిత హారం ప్రోగ్రాంను తేలికగా తీసుకుంటే అంతే సంగతులు అంటున్నారు.
అమరచింత మండల పరిధిలోని సింగంపేట గ్రామాన్నికలెక్టర్ శ్వేతామ హంతి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. మొదట ఆత్మకూర్‌లో హరితహారంపై సమీక్షా సమావేశంజరిగింది. కలెక్టర్ జిల్లా కేంద్రం నుండి నేరుగా సింగంపేట గ్రామానికి వచ్చా రు. దీంతో అధికారులు ఆగమేఘాల మీద గ్రామంలో మొక్కలను నాటేందుకు పరుగులు తీశారు. అయితే, గుంతలు తీయడం మరిచారు. కలెక్టర్ మొక్కలను నాటేందుకు కేవలం ఒకే గుంత తీసి, ఆమెను మోససుచ్చి ఆరోజు గడపవచ్చనుకున్నారు.
గ్రామానికి చేరుకున్న కలెక్టర్ కెనాల్‌ను, ప్రభుత్వ స్థలా న్ని పరిశీలించారు. హరిత హారం గురించి వాకబు చేశారు. మొక్కలు పెంచేందుకు ఎస్టీమేషన్ ఎంత వేశారని అధికారులను ప్రశ్నించారు. 8,900 మొక్కలనునాటేందుకు ఎస్టీమేషన్ వేశా మని వారు అమరచింత: హరిత హారం కార్యక్రమాన్ని ఆశామాషీ గా తీసుకుంటున్నారా.. అని కలెక్టర్ శ్వేతామహంతి అధికారులపై మం డిపడ్డారు. మండల పరిధిలోని సింగంపేట గ్రామాన్నికలెక్టర్ శ్వేతామ హంతి బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. మొదట ఆత్మకూర్‌లో హరితహారంపై సమీక్షా సమావేశం కోసం అధికారులు ఏర్పాటు చేశా రు. కలెక్టర్ జిల్లా కేంద్రం నుండి నేరుగా సింగంపేట గ్రామానికి వచ్చా రు. దీంతో అధికారులు ఆగమేఘాల మీద గ్రామంలో మొక్కలను నా టేందుకు ఏర్పాట్లు చేశారు.
కలెక్టర్ మొక్కలను నాటేందుకు కేవలం ఒకే గుంత తీశారు. గ్రామానికి చేరుకున్న కలెక్టర్ కెనాల్‌ను, ప్రభుత్వ స్థలా న్ని పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మహ్మద్ అలీ, ఫీల్డ్‌అసిస్టెంట్ రవికుమార్‌లను మొక్కలు పెంచేందుకు ఎస్టీమేషన్ ఎంత వేశారని ప్రశ్నించారు. 8,900మొక్కలనునాటేందుకు ఎస్టీమేషన్ వేశా మని వారు తెలిపారు. అయితే 300 గుంతలు తీశామని చెప్పగానే ఆమెకు కోపం వచ్చింది. గ్రామంలోని కెనాల్‌కు అటు ఇటు ప్రభుత్వ స్థలాలున్నాయి. వేలాది మొక్కలు నాటేందుకు వీలు ఉంది. అక్కడ మొక్కలు నాటకుండా ఎంచేస్తున్నారని ప్రశ్నించారు.
ఇక్కడ లేబర్ సమస్య ఉందని ఎపిఒ సుకన్య ఎంపిడిఒ పుష్పలీల తమదేం తప్పు లేనట్లుగా చెప్పితప్పుకోవాలనుకున్నారు. దీనితో కలెక్టర్ కు ఇంకా కోపం వచ్చింది. ‘ కూలీలను సమీకరించలేపుడు మీరు ఇక్కడ ఉద్యోగం చేయడం మానేయండి,’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరితహారాన్ని ఇలా ఆషా మాషిగా తీసుకుంటున్నందుకు, తనని మాటలతో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహ్మద్‌అలీ, ఫీల్డ్ అసిస్టెంట్ రవికుమార్‌లకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేశారు.వారం రోజుల్లోగా లక్షం నెరవేరకపో తే సస్పెండ్ చేస్తామని ఆమె హెచ్చరించారు.
