కలకత్తాలో అంబులెన్స్ ను ఢీకొన్న లారీ

కలకత్తాలో అంబులెన్స్ ను ఢీకొన్న లారీ

మెడికల్ క్యాంపు కోసం అంబులెన్స్ లో వెళ్తున్న ఓ వైద్య బృందాన్ని మృత్యువు లారీ రూపంలో కాటేసింది. రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం అయ్యారు. ఒకరు తీవ్రగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

నలుగురు వైద్యులు ఓ మెడికల్ క్యాంపు నిర్వహించేందుకు బయల్దేరారు. ఇంతలో ఓ వాహనాన్ని ఓవర్ట్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ వీరి అంబులెన్స్ ను ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అంబులెన్స్ లో ఉన్న నలుగురూ సజీవదహనం అయ్యారు. అందులో వైద్యులు, నర్సులు ఉన్నారు. ఆ సమయంలో అంబులెన్స్ లో రోగులెవరూ లేరు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అంబులెన్స్ లో వ్యక్తిని కాపాడారు. అనంతరం ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page