బొద్దింకలు తినేయచ్చు..!

బొద్దింకలు తినేయచ్చు..!

బొద్దింక.. అప్పుడప్పుడు మనకు కిచెన్ లో దర్శనమిస్తూ.. మహిళలను భయపెడుతూ ఉంటుంది. చూడటానికి చిన్నగా ఉన్నా.. దానిని చూస్తే చాలు చాలా మంది మహిళలు పరుగులు తీస్తుంటారు. అంతేకాదు.. తినడానికి  వండుకున్న  గిన్నెల్లో దూరి నానా హంగామా చేసి అనారోగ్యాలకు కారణమౌతుంటుంది. ఆహారాన్ని పాడు చేసే ఈ బొద్దింక నిజంగా ఆహారం గా మారుతోంది. మీరు చదివింది నిజమేనండి. బొద్దింకలను తినొచ్చట. అంతేకాదు ఇందులో ప్రోటీన్స్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలే చెప్పడం గమనార్హం.

మన దేశంలో అంటే వీటిని తినడానికి ఇష్టపడరు కానీ.. ఇతర దేశాల్లో బొద్దింకలాంటి మరికొన్ని కీటకాలను ఆహారంగా తీసుకుంటారు. ఈ బొద్దింకలను కుక్ చేసినప్పుడు అందులోని బ్యాక్టీరియా చనిపోతుంది. దీంతో.. అవి తినడం వల్ల అనారోగ్య సమస్యలేమి రావని నిపుణులు చెబుతున్నారు. థాయిలాండ్ లో బొద్దింకలతో చేసిన ఆహారాన్ని తినడానికి ఎక్కువ మక్కువ చూపుతారట. అంతేకాదు.. అవి కరకరలాడటానికి డీప్ ఫ్రై చేసుకొని మరీ తింటారట.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos