Asianet News TeluguAsianet News Telugu

కర్నూలు ఏయిర్ పోర్టుకు 21న శంకుస్థాపన

కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద కట్టాలనుకుంటున్న గ్రీన్ ఫీల్డ్  విమానాశ్రయానికి ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తారు. 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తారు. ఆయనే ఈ విషయం  వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, మండల కేంద్రాలలో హెలిపాడ్ లు నిర్మించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

CM to lay foundation for Kurnool airport on June 21

కర్నూలు సమీపంలోని  ఓర్వకల్లు వద్ద కట్టాలనుకుంటున్న గ్రీన్ ఫీల్డ్  విమానాశ్రయానికి ఈ నెల 21న శంకుస్థాపన చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఆయన వెల్లడించారు.  శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి  మౌలిక వసతులపై తన నివాసంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. 

 

ఇలాగే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భూ సమస్యలను సత్వరం పరిష్కరించి నిర్మాణం ప్రారంభించి సంవత్సర కాలంలో పార్టి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాలలో హెలిపాడ్ లు నిర్మించాలని  ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏటా విశాఖ, విజయవాడ, తిరుపతిలలో ఎయిర్ షో లు ఏర్పాటు చేయాలని కోరారు.

 

రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ద్వారా సర్వీసులు పెంచి అందరికి విమానయానం అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు.

 

విజయవాడ నుంచి దుబాయ్, హాంకాంగ్, కౌలాలంపూర్ లకు నేరుగా విమాన సర్వీసులు నడపాలని సూచించారు. ప్రపంచ ప్రసిద్ద నగరాలన్నీ సొంత ఎయిర్ లైన్స్ కలిగి ఉన్నాయని, అమరావతి కూడా సొంత ఎయిర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

 

దేశం మొత్తం మీద 18 శాతం ఎయిర్ ట్రాఫిక్ ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 35 శాతం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. దీనికి అనుగుణంగా విమానాశ్రయాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని కోరారు. విజయవాడ విమానాశ్రయంలో రన్ వే, రెండో టెర్మినల్  భవనాల పనులు త్వరిత గతిన పూర్తీ చేసి కార్గో విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరారు. 

 

ఢిల్లీ –ఇండోర్-తిరుపతి- విజయవాడ-ముంబై, విజయవాడ-తిరుపతి-ఇండోర్- ఢిల్లీ మద్య జులై నెలాఖరు నుంచి జూమ్ ఎయిర్ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios