Asianet News TeluguAsianet News Telugu

నంద్యాలలో ముఖ్యమంత్రి ఇఫ్తార్ పార్టీ, ఖర్చు కోటి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది  ఇఫ్తార్ పార్టీకి  సంచలన వార్తల కేంద్రమయిన  నంద్యాలను ఎన్నుకున్నారు.ఈ వేడుకు  ప్రభత్వఅధికారిక  కార్యక్రమంగా నిర్వహిస్తారు.ఈ ఇఫ్తార్‌ విందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి   ముస్లిం సోదరులను  భారీగా ఎత్తున ఆహ్వనించి  పెద్ద సంబరంగా జరపాలనుకుంటున్నారు.  

CM naidu to host  iftar at Nandyal this year

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఏడాది  ఇఫ్తార్ పార్టీకి  సంచలన వార్తల కేంద్రమయిన  నంద్యాలను ఎన్నుకున్నారు.ఈ వేడుకు  ప్రభత్వఅధికారిక  కార్యక్రమంగా నిర్వహిస్తారు.

 

ఈ ఇఫ్తార్‌ విందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి  ఉన్న ముస్లిం సోదరులను పెద్ద ఎత్తున ఆహ్వనించి  పెద్ద సంబరంగా జరపాలనుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీ నంద్యాల మార్కెట్‌ యార్డులో సాయంత్రం ఆరు గంటల నుంచి సీఎం ఇఫ్తార్‌ విందు ఇస్తారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.90 లక్షలు మంజూరు చేసింది.

 

నంద్యాలను ఎంచుకోవడానికి అక్కడ ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటమే కాదు, నంద్యాల త్వరలో  ఉప ఎన్నికలకు వెళ్లడం కూడా కారణం.

 

ప్రభుత్వంలో ఒక్క మైనారిటీ మంత్రికూడా లేరు. ముస్లింలలో ఈ అసంతృప్తి కూడా ఉంది. గతంలో నంద్యాల సీటును తెలుగుదేశం ముస్లింలకేకేటాయిస్తూ వచ్చింది. ఆ కోటా కింద వచ్చిన వాడే ఎన్ ఎమ్ డి ఫరూక్. ఇపుడాయన వూసేలేదు. ఈ అపోహలను పొగొట్టి, నంద్యాల ఉప ఎన్నికలనాటికి ముస్లింలను మచ్చిక చేసుకోవడమే కోటి రుపాయల ఇఫ్తార్ ఉద్దేశమని అంతా అనుకుంటున్నారు.

 

రాష్ట్రంలో ముస్లింలను తెలుగుదేశం ప్రభుత్వం చాలా  బాగా చూసుకుంటూ ఉందని, అందుకే రాజధానిలో కాకుండా ముస్లింల జనాభా ఎక్కుగా ఉన్న నంద్యాలను ఇఫ్తార్ కు ఎంచుకున్నానని ముఖ్యమంత్రి చెబుతారు.

 

 ఇలా,రాజధానిలో కాకుండా  ప్రతి ఏడాది ఒక్కొక్క ముస్లిం ప్రాంతంలో  ఇఫ్తార్ పార్టీ ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

 

నంద్యాల ఇఫ్తార్ పార్టీకి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జివొ కూడా విడుదల చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios